News February 2, 2025

నంద్యాలలో పాత కక్షలతో వ్యక్తిపై కత్తితో దాడి

image

పాత కక్షల కారణంగా ఓ వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటన నంద్యాలలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ శివారు ప్రాంతంలోని నందమూరి నగర్‌కు చెందిన గౌస్‌కు రోజాకుంట వీధికి చెందిన హరికి మధ్య మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బస్టాండ్ వద్ద వీరిద్దరూ ఎదురుపడగా హరిపై గౌస్ కత్తితో దాడి చేశాడు. నంద్యాల వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News November 27, 2025

విజయవాడ GGHలో వేధిస్తున్న MNO&FNOల కొరత..!

image

విజయవాడ జీజీహెచ్‌లో రోగులను వార్డుల్లోకి మార్చే (MNO/FNO) సిబ్బంది తీవ్ర కొరతతో అత్యవసర చికిత్సలకు అంతరాయం కలుగుతోంది. ఆసుపత్రిలో 1657 బెడ్లు ఉండగా, కనీసం 400 మంది సిబ్బంది అవసరం. ప్రస్తుతం 100 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన 4650 మంది సిబ్బంది నియామక ఫైలు ముందుకు కదలకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

News November 27, 2025

తూ.గో.లో మండపేట విలీనం.. పెరగనున్న పట్టణ జనాభా

image

జిల్లాల పునర్విభజనలో భాగంగా తూ.గో జిల్లా పట్టణ జనాభా పెరగనుంది. మండపేట నియోజకవర్గాన్ని జిల్లాలో పూర్తిగా కలుపుతూ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మండపేట మున్సిపాలిటీ జిల్లా పరిధిలోకి చేరనుంది. ప్రస్తుతం రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు పట్టణాలతో కలిపి 4,27,380 ఉన్న జిల్లా పట్టణ జనాభా.. మండపేట చేరికతో 4,80,968కి చేరనుంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News November 27, 2025

అత్యాచార నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

మానసిక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు జడ్జి వై. వెన్నయ్య నాయుడు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ రాహుల్ మీనా బుధవారం తెలిపారు. అంబాజీపేట మండలం చిరుతపూడికి చెందిన కట్టా బ్రహ్మేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సత్వర దర్యాప్తుతో నిందితుడికి శిక్ష పడింది.