News June 23, 2024
నంద్యాలలో భర్తను హత్య చేసిన భార్య
నంద్యాల పట్టణంలోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోని సుద్దుల పేటలో హత్య జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భర్తను భార్యే కత్తెరతో పొడిచింది. తీవ్ర గాయాలైన అతడిని నంద్యాల జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 11, 2024
చంద్రశేఖరన్‌తో మంత్రి టీజీ భరత్ సెల్ఫీ
టాటా సన్స్ గ్రూప్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌ను మంత్రి టీజీ భరత్ కలిశారు. కారులో ఆయనతో సెల్ఫీ తీసుకున్నారు. విలువైన వ్యక్తిని కలవడం స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆయన పంచుకునే జ్ఞానం తనను నిరంతరం ఆకట్టుకుంటోందని కొనియాడారు. వ్యక్తిగత, వృత్తిపరమైన ఎదుగుదలకు కట్టుబడి ఉన్న వ్యక్తిని కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ ఆయన ట్వీట్ చేశారు.
News November 11, 2024
ప్రజా సమస్యలను గడువులోగా పరిష్కరించాలి: నంద్యాల ఎస్పీ
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 85 ఫిర్యాదులను స్వీకరించినట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ప్రజల ఇచ్చిన ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట పరిధిలో సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీ అధికారులకు సూచించారు.
News November 11, 2024
విషాదం.. మహానంది కోనేటి వద్ద మూర్చకు గురైన బాలుడి మృతి
మహానంది క్షేత్రంలోని కోనేరు వద్ద స్నానమాచరిస్తూ మూర్చకు గురైన బాలుడు మృతి చెందినట్లు 108 సిబ్బంది తెలిపారు. సోమవారం తాడిపత్రికి చెందిన భక్తులు స్నానమాచరిస్తుండగా మూర్చకు గురికావడంతో 108 వాహనంలో నంద్యాలకు తరలించారు. మార్గమధ్యంలో తాడిపత్రి మండలం సేనగల గూడూరుకు చెందిన 9 ఏళ్ల చంద్రశేఖర్ రెడ్డి మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగారు.