News March 29, 2024

నంద్యాలలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

image

రాష్ట్రంలోనే అత్యధికంగా నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, కర్నూలు జిల్లాలో 41.09 డిగ్రీలు నమోదైనట్లు అమరావతి వాతావరణం కేంద్రం వెల్లడించింది. రాయలసీమ ప్రాంతాల్లో 31 మండలాల్లో 31 వడగాలులు వీచాయి. నంద్యాల జిల్లాలో 9, కర్నూలు 2 మండలాల్లో వడగాలులు వీచినట్లు తెలిపారు. ఇవాళ నంద్యాల జిల్లాలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.

Similar News

News January 24, 2025

నష్టపరిహార పెంపును పరిశీలిస్తాం: నంద్యాల కలెక్టర్

image

జాతీయ రహదారి 340సీ ప్యాకేజీ కింద పెండింగ్‌లో ఉన్న నష్టపరిహారం పెంపును పరిశీలిస్తామని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. గురువారం నంద్యాల కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ క్లెయిమ్స్‌ల నష్టపరిహార పెంపు విషయంపై జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్‌తో కలిసి సమీక్షించారు. భూ సేకరణ అధికారులు, సంబంధిత రైతులు వివరించిన అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు.

News January 23, 2025

కర్నూలు జిల్లా నిందితుడికి 20ఏళ్ల జైలు శిక్ష

image

కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామానికి చెందిన షేక్షావలి (30) కర్నూలులోని ఓ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి జి.శాంత ఫిర్యాదు మేరకు 2021 ఆగస్టు 12వ తేదీన పోక్సో యాక్ట్ నమోదు చేశారు. అన్ని కోణాల్లో విచారించిన కర్నూలు జిల్లా స్పెషల్ పోక్సో కోర్టు జడ్జి నిందితుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.

News January 23, 2025

నంద్యాల రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వృద్ధుడు మృతి

image

నంద్యాల రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు నంద్యాల రైల్వే ఎస్సై అబ్దుల్ జలీల్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఫ్లాట్‌ఫామ్ నంబర్‌2 వద్ద వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. మృతుడు కాషాయపు వస్త్రాలు ధరించాడని, సుమారు 60 ఏళ్లు ఉంటాయన్నారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. ఆచూకీ తెలిస్తే రైల్వే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.