News January 25, 2025
నంద్యాలలో రూ.8కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి ఫరూక్
తెలుగుదేశం పార్టీ గెలిచిన ఆరు నెలల్లోనే నంద్యాలలో రూ.8కోట్ల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభించామని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయాన్ని తొలిసారిగా సందర్శించిన ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించి పెండింగ్ పనులు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. నంద్యాలను అన్ని విధాలా అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి ఫరూక్ స్పష్టం చేశారు.
Similar News
News January 28, 2025
బండి సంజయ్‌కు టీపీసీసీ చీఫ్ కౌంటర్
TG: గద్దర్‌కు పద్మ అవార్డు ఇవ్వబోమన్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఆరెస్సెస్, బీజేపీ నేతలకే అవార్డులు ఇవ్వాలా అని ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. ప్రజా యుద్ధ నౌకగా గద్దర్ పేరు చిరస్మరణీయమని పేర్కొన్నారు.
News January 28, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో క్రైమ్ న్యూస్
ఎల్లారెడ్డిపేట మండలంలోని ఐదు తండాల్లో ఎక్సైజ్ పోలీసుల దాడులు..300 లీటర్స్ బెల్లం పానకం, 10 లీటర్స్ నాటుసారా ధ్వంసం @కిసాన్ దాస్ పేటలో చోరీ విఫలయత్నం @రుద్రంగి మండల కేంద్రంలో మళ్ళీ దొంగల బీభత్సం..రూ. 10వేలు చోరీ @ఎల్లారెడ్డిపేటలో వీడని మూఢనమ్మకాలు @ఎల్లారెడ్డిపేలో దొంగల బీభత్సం..రూ.30వేల అపహరణ @తంగళ్ళపల్లిలో దేవుళ్ళ విగ్రహాలు ధ్వంసం.
News January 28, 2025
నిద్రపోయే ముందు ఇలా చేయట్లేదా?
శరీరం డీహైడ్రేషన్‌కు గురవ్వకుండా ఉండాలంటే తగినంత నీరు అవసరం. రోజును గ్లాసు నీళ్లతో ప్రారంభించడమే కాకుండా నిద్ర పోయే ముందూ గ్లాసు నీరు తాగడం ప్రయోజనకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుందంటున్నారు. అజీర్తి, గ్యాస్ సమస్యలు ఉన్నవారు గ్లాసు గోరు వెచ్చని నీరు తాగితే బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.