News September 10, 2024

నంద్యాలలో 10న దిశా కమిటీ సమావేశం

image

ఈ నెల 10వ తేదీ దిశా కమిటీ (కేంద్ర ప్రభుత్వ పథకాలు, నిధులు, అభివృద్ధిపై సమీక్ష) సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, కన్వీనర్ జి.రాజకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్లో సోమవారం ఉ.10 గంటలకు ఎంపీ బైరెడ్డి శబరి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందన్నారు. జిల్లా మంత్రులు, జిల్లా పరిషత్ ఛైర పర్సన్, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు పాల్గొంటారని తెలిపారు.

Similar News

News October 10, 2024

రతన్ టాటా మృతి ఎంతో బాధాకరం: మంత్రి టీజీ భరత్

image

టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతి ప‌ట్ల మంత్రి టీజీ భ‌ర‌త్ సంతాపం వ్య‌క్తం చేశారు. ర‌త‌న్ టాటా మ‌ర‌ణ‌వార్త త‌న‌ను ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసింద‌న్నారు. ర‌త‌న్ టాటా ఆలోచ‌నా విధానంతో టాటా గ్రూప్‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లార‌ని చెప్పారు. ఆయ‌న‌ ఎన్నో ప‌రిశ్ర‌మ‌లు నెల‌కొల్పి లక్షలాది మంది యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించార‌ని కొనియాడారు.

News October 10, 2024

నంద్యాల: భోధనంలో పిడుగు

image

బండిఆత్మకూరు మండలం భోధనం గ్రామంలో గురువారం మధ్యాహ్నం పిడుగు పడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం వర్షానికి ముందు ఉరుములు, మెరుపులతో పాటు పిడుగు పడింది. ఎవరూ లేని చోట ఉన్న వృక్షంపై పిడుగు పడటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని గ్రామస్థులు తెలిపారు.

News October 10, 2024

నంద్యాల: కొబ్బరి బొండంపై నవదుర్గల చిత్రాలు

image

ఆళ్లగడ్డకు చెందిన ఆర్టిస్టు విజయ్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొబ్బరి బొండంపై నవదుర్గ మాతల చిత్రాలను అక్రిలిక్ రంగులతో తీర్చిదిద్దారు. ఆది పరాశక్తి జగజ్జనని 9 రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధిధాత్రి అమ్మవార్ల చిత్రాలను చిత్రీకరించారు.