News February 17, 2025

నంద్యాలలో 37°C ఉష్ణోగ్రత

image

నంద్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ నంద్యాలలో ఏకంగా 37°C ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కర్నూలులో 38°C ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News December 8, 2025

ఖమ్మం: రెండో విడతలో ఈ జీపీలు ఏకగ్రీవం

image

కామేపల్లి (M) – జొగ్గూడెం, కెప్టెన్ బంజారా, జగ్గన్నదాతండా,లాల్యతండా, పాతలింగాల,ఊటుకూరు, KMM రూరల్ (M)- దారేడు, పల్లెగూడెం, ముదిగొండ- వల్లభి, నేలకొండపల్లి (M) – ఆచార్లగూడెం, అజయ్ తండా, కట్టుకాచారం, కూసుమంచి (M) – చంధ్యాతండా, లాల్ సింగ్ తండా, కొత్తూరు, అజ్మీరా హీరమన్ తండా, కోక్యాతండా, పాలేరు, తిరుమలాయపాలెం (M)- లక్మిదేవిపల్లి, హైదర్ సాయి పేట, ఎర్రగడ్డ, తిమ్మక్కపేట, హస్నాబాద్ జీపీలు ఏకగ్రీవమయ్యాయి.

News December 8, 2025

పాలమూరు: వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ పదవికి పోటీ

image

కొత్తకోట మండలం రామనంతపూర్‌లో మొత్తం 8 వార్డులున్నాయి. రెండో విడత నామినేషన్‌లో భాగంగా సర్పంచ్ పదవికి ఆరుగురు, వార్డు మెంబర్లకు 24 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఏకగ్రీవంగా చేసి, నిధులతో దేవాలయం నిర్మించాలని తీర్మానించగా, నలుగురు అభ్యర్థులు తప్పుకున్నారు. కానీ యాదగిరిరెడ్డి, శివుడు పోటీ నుంచి తప్పుకోకపోవడంతో ఏకగ్రీవ చర్చలు విఫలమయ్యాయి. వార్డు మెంబర్‌లను మాత్రం ఏకగ్రీవం వరించింది.

News December 8, 2025

హోటళ్లలో ఇకపై ఆధార్ కాపీ అవసరం లేదు!

image

వెరిఫికేషన్ పేరుతో హోటళ్లు, ఈవెంట్ల నిర్వాహకులు కస్టమర్ల ఆధార్ కాపీలను తీసుకోకుండా UIDAI కొత్త రూల్ తీసుకురానుంది. QR కోడ్ స్కానింగ్ లేదా ఆధార్ యాప్ ద్వారా వెరిఫై చేసేలా మార్పులు చేయనుంది. ఆధార్ వెరిఫికేషన్ కోరే హోటళ్ల రిజిస్ట్రేషన్లను తప్పనిసరి చేసింది. యూజర్ల ప్రైవసీకి, డేటాకు రక్షణ కల్పించేందుకు UIDAI ఈ దిశగా అడుగులేస్తోంది. దీంతో ఓయో, ఇతర హోటళ్లలో గదులు బుక్ చేసుకునే వారికి ఉపశమనం కలగనుంది.