News February 17, 2025

నంద్యాలలో 37°C ఉష్ణోగ్రత

image

నంద్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ నంద్యాలలో ఏకంగా 37°C ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని మిగతా మండలాల్లోనూ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఫిబ్రవరిలోనే ఇలా ఉంటే రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కర్నూలులో 38°C ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News April 17, 2026

కుప్పం కోర్టు ఉత్వర్వును సస్పెండ్ చేసిన హైకోర్టు

image

YCP ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, గిరిధర్‌రెడ్డికి హైకోర్టులో <<19667603>>ఎదరుదెబ్బ<<>> తగిలింది. CM చంద్రబాబుపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో వీరి రిమాండ్‌ను తోసిపుచ్చుతూ కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది.

News April 17, 2026

లక్షెట్టిపేట: జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

image

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు వైద్యులు అవగాహన కల్పించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు విభాగాలను ఆయన పరిశీలించి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ దిలీప్ పాల్గొన్నారు.

News April 17, 2026

HYD: Instaలో కూతురి ఫేక్ అకౌంట్.. తండ్రికి అశ్లీల వీడియోలు!

image

మేడిపల్లి PS పరిధిలో సైబర్ కిరాతకుల వికృత చేష్టలు వెలుగుచూశాయి. కాచవానిసింగారం దివ్యానగర్‌కు చెందిన వ్యక్తి(50) కుమార్తె పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించారు. అతనికి అశ్లీల చిత్రాలు, సందేశాలు పంపుతూ వేధింపులకు దిగారు. అంతటితో ఆగకుండా వాటిని బంధుమిత్రులకు పంపించి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.