News April 12, 2025

నంద్యాల: ఇంటర్ ఫెయిల్ కావడంతో విద్యార్థి ఆత్మహత్య.!

image

ఇంటర్ ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నంద్యాల జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బండి ఆత్మకూరుకి చెందిన మస్తాన్ అనే విద్యార్థి నంద్యాల గవర్నమెంట్ కాలేజీలో చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపం చెంది ఉరి వేసుకొని <<16067190>>ఆత్మహత్య చేసుకున్నాడు.<<>> తండ్రి పెద్ద మౌలాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.

Similar News

News November 25, 2025

MBNR: ఐబొమ్మ రవిపై జడ్చర్ల MLA వ్యాఖ్యలు.. మీరేమంటారు.?

image

ఐబొమ్మ రవిని ప్రజలు రాబిన్‌హుడ్ హీరోగా భావిస్తున్నారని జడ్చర్ల MLA అనిరుధ్ రెడ్డి <<18378394>>వ్యాఖ్యలు<<>> చేసిన విషయం తెలిసిందే. టికెట్ ధరలు పెంచడం తప్పనే భావనలో వారు ఉన్నారని, ₹1000 కోట్లతో తీస్తే బాగుపడేది హీరో, డైరెక్టర్, నిర్మాత అని, ₹50-100Cr పెట్టి తీయలేరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. రవిని శిక్షించాలని కొందరంటున్నారని, కోర్టు తీర్పు ఎలా ఇస్తుందో వేచి చూడాలంటున్నారు. MLA వ్యాఖ్యలపై మీ కామెంట్.?

News November 25, 2025

ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

image

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!

News November 25, 2025

కొరిశపాడు: ATMలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

image

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న 2 ATMలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. ఆదిలాబాద్ టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్‌తో ATMలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి కొరిశపాడు(M) రావినూతల గ్రామానికి చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.