News January 28, 2025

నంద్యాల: ఇంట్లో సిలిండర్ పేలి ఇద్దరి మృతి!

image

నంద్యాల జిల్లాలో విషాద ఘటన జరిగింది. చాపిరేవులలో ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులు దినేశ్ (10), సుబ్బమ్మ (60)గా గుర్తించారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంట చేస్తుండగా సిలిండర్ పేలి ఈ ఘటన జరిగింది.

Similar News

News October 24, 2025

పల్నాడు జిల్లాకు అందివస్తున్న అవకాశాలు

image

కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల అమలుకు కార్యాచరణ ప్రారంభించడంతో పల్నాడు జిల్లాకు అవకాశాలు అందిస్తున్నాయి. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే, చెన్నై కారిడార్ బుల్లెట్ ట్రైన్ పల్నాడు జిల్లా మీదగా అమరావతికి చేరే విధంగా DPRలు సిద్ధమయ్యాయి. నాగార్జునసాగర్ ఎయిర్పోర్ట్, మాదిపాడు వద్ద కృష్ణానదిపై భారీ బ్రిడ్జి నిర్మాణం పల్నాడులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బాటలు వేయనున్నాయి.

News October 24, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. కాకినాడ కలెక్టర్ సూచనలు

image

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి రేపు మధ్యాహ్నం వాయుగుండంగా మారుతుందని కలెక్టర్ షాన్‌మోహన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. పరిస్థితులను సమీక్షించేందుకు కలెక్టరేట్, ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని, అవి 27వ తేదీ వరకు పనిచేస్తాయని చెప్పారు. సహాయం కోసం 0884-2356801 నంబర్‌ను సంప్రదించవచ్చన్నారు.

News October 24, 2025

ఆదిలాబాద్: దొంగ బాబాలు.. ఘరానా మోసాలు

image

ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ బాబాలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. ఐదు నెలల్లో ఐదు వేర్వేరు ఘటనల్లో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. ఇటీవల బాలికపై లైంగిక దాడి, నకిలీ వైద్యం పేరిట అమాయకుల నుంచి లక్షల్లో వసూలు చేసిన ముఠాలపై కేసులు నమోదైనా, ఇలాంటి ఆగడాలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. మూఢ నమ్మకాలను సొమ్ము చేసుకుంటున్న ఈ నకిలీ స్వాములపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరముంది.