News March 29, 2025

నంద్యాల: ఉగాది సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

ఉగాది సందర్భంగా నంద్యాల మీదుగా రెండు రైళ్ల ను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు-హుబ్లీ మధ్య ఈ రైళ్లను ఏర్పాటు చేశారు. ఈనెల 31న రాత్రి 8 గంటలకు గుంటూరు నుంచి హుబ్లీకి బయలుదేరే రైలు(07271) నంద్యాలకు రాత్రి 12:50 గంటలకు చేరనుంది. అలాగే వచ్చే నెల 1న ఉదయం 11 గంటలకు హుబ్లీ నుంచి గుంటూరుకు బయలుదేరే రైలు(07272) నంద్యాలకు రాత్రి 7:50 గంటలకు చేరనుంది.

Similar News

News July 7, 2025

ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

image

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.

News July 7, 2025

250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తాం: కలెక్టర్

image

ఇబ్రహీంపట్నంలోని మూల‌పాడు బ‌ట‌ర్‌ఫ్లై పార్క్ వ‌ద్ద 250 హెక్టార్‌లలో ఎకో టూరిజం అభివృద్ధి చేస్తామని కలెక్టర్ లక్ష్మీశా అన్నారు. ఆదివారం పర్యాటక రంగ అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడుతూ.. జంగిల్ స‌ఫారీ, బ‌యోడైవ‌ర్సిటీ పార్క్, నేచ‌ర్ ట్ర‌య‌ల్స్ ఏర్పాటు ద్వారా మూల‌పాడు బ‌ట‌ర్‌ఫ్లై పార్క్‌లో ఎకో టూరిజం అభివృద్ధి చేసేలా జిల్లా దార్శనిక ప్రణాళిక తయారైందన్నారు.

News July 7, 2025

రూ.23 లక్షలతో దుబాయ్ గోల్డెన్ వీసా

image

భారత్, బంగ్లాదేశ్ ప్రజలు లక్ష ఏఈడీ (రూ.23.30 లక్షలు)లు చెల్లిస్తే దుబాయ్ గోల్డెన్ వీసా పొందొచ్చు. గతంలో రూ.4.66 కోట్లకుపైగా పెట్టుబడి పెడితే గోల్డెన్ వీసా మంజూరు చేసేది. ఇప్పుడు డైరెక్ట్‌గా డబ్బు చెల్లించి వీసా తీసుకోవచ్చు. ఈ వీసా పొందినవారు తమ ఫ్యామిలీతో దుబాయ్‌లో నివసించవచ్చు. డ్రైవర్లు, పనిమనుషులను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏదైనా జాబ్, బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంది. జీవితకాలం అక్కడే ఉండొచ్చు.