News August 22, 2024
నంద్యాల: ఉల్లిగడ్డల లారీ బోల్తా
పాణ్యం మండలంలోని తమ్మరాజు పల్లె గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉల్లిగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడటంతో ఉల్లిగడ్డల బస్తాలన్నీ చెల్లాచెదురయ్యాయి. లారీ డ్రైవర్‌కు గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News September 16, 2024
కర్నూలు క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?
☛ ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు సేవలందించింది?
☛ కొండారెడ్డి బురుజును ఎవరు నిర్మించారు?
☛ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జన్మించిన గ్రామం పేరేంటి?
☛ పూర్వం నంద్యాలను ఏ పేరుతో పిలిచేవారు?
☛ వరల్డ్‌బుక్ ఆఫ్రికార్డ్స్లో శ్రీశైలం ఆలయానికి చోటు దక్కడానికి కారణమేంటి?
★ పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడొచ్చు.
News September 16, 2024
నంద్యాలలో మంత్రి కుమారుడిపై దాడి
నంద్యాలలో ఆదివారం మంత్రి ఎన్ఎండీ ఫరూక్ కుమారుడు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్‌పై నలుగురు దుండగులు దాడి చేశారు. రాజ్ థియేటర్ నుంచి వాహనంలో వెళ్తుండగా మోటార్ బైక్‌పై వెంబడించిన నలుగురు ఫిరోజ్ వెహికల్‌పై దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన ఫిరోజ్.. వాహనం దిగి దాడికి పాల్పడిన వారిలో ఒకరిని పట్టుకున్నారు. దాడికి ప్రయత్నించిన వ్యక్తిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News September 16, 2024
శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు.