News July 16, 2024
నంద్యాల: ఊటీ కాదు మన “నల్లమల” అడవే

నంద్యాల- గిద్దలూరు ఘాట్ రోడ్డులో అల్లుకుపోయిన పచ్చటి దట్టమైన చెట్లతో నల్లమల అడవి అబ్బురపరుస్తుంది. దీనికి తోడు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మంచు దుప్పటి నల్లమలను కప్పేసింది. ఊటీ, కొడైకెనాల్ ప్రాంతాలను తలపించేలా పొగ మంచు అందాలు ప్రయాణికులు, పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి. నంద్యాల నుంచి విజయవాడకు బస్సు, రైలు మార్గం ద్వారా ప్రయాణించే వారు ఈ దృశ్యాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు.
Similar News
News December 12, 2025
ఆదోనిలో లారీ బోల్తా.. భయంతో డ్రైవర్ ఆత్మహత్య

ఆదోని మండల పరిధిలోని బైచిగేరి క్రాస్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ లక్ష్మన్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.
News December 12, 2025
ఆర్యవైశ్యులు ఎప్పటికీ సీఎం చంద్రబాబుతోనే: మంత్రి టీజీ

సీఎం చంద్రబాబు నాయుడు ఆర్యవైశ్యులకు సముచిత గౌరవం కల్పిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప.గో జిల్లా పెనుగొండ పేరును వాసవీ పెనుగొండగా సీఎం మార్పు చేశారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైశ్యుల తరఫున సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. సీఎం చంద్రబాబుకు ఆర్యవైశ్యులు ఎప్పటికీ అండగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు.
News December 12, 2025
కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్గా నాగేంద్ర

తుగ్గలి గ్రామానికి చెందిన తుగ్గలి నాగేంద్రను కర్నూలు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్కు నాగేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.


