News February 12, 2026
నంద్యాల: ఎదురు చూపులు!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడిచినా కొత్త పింఛన్ రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా వితంతువులతో పాటు వృద్ధాప్య, కళాకారులు, ఇతర పింఛన్లకు అర్హత కలిగిన సుమారు 6 వేలకు మందిపైగా ఉన్నారు. వారంతా నూతన పింఛన్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నూతన పింఛన్ దరఖాస్తుకు అవకాశం కల్పించాలని అర్హత కలిగిన లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News March 15, 2026
వారికి LPG సిలిండర్లు బంద్.. కేంద్రం ప్రకటన

పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు ఉన్నవారికి ఎల్పీజీ సిలిండర్లు సప్లై చేయవద్దని కేంద్రం ఆదేశించింది. PNG వినియోగించుకుంటూనే డొమెస్టిక్ సిలిండర్లు తీసుకోవడం మంచిది కాదంది. వెంటనే LPG కనెక్షన్లు సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. చమురు సంస్థలు వారికి కొత్తగా LPG కనెక్షన్లూ ఇవ్వొద్దని ఆదేశించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో HYDతో పాటు విశాఖ, విజయవాడ, గుంటూరు, కడప తదితర నగరాల్లో PNG సౌకర్యం ఉంది.
News March 15, 2026
వైజాగ్ స్టీల్ సీఎండీగా ప్రభాకర్..!

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పదవికి MNVS.ప్రభాకర్ పేరును కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన NMCS స్టీల్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శనివారం న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన సెర్చ్-కమ్-సెలెక్షన్ కమిటీ సమావేశంలో ఐదుగురిని ఇంటర్వ్యూ చేసి ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
News March 15, 2026
గుత్తి కోటలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే!

గుత్తి కోట ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్ నుంచి గుత్తి కోట వరకు హెరిటేజ్ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం అదే గ్రౌండ్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జ్యోతి ప్రజ్వలన, ప్రార్థన, అతిథుల ప్రసంగం, సంధ్యామూర్తి శ్రీ నృత్య కళానిలయం వారి శివ పాదం, (జబర్దస్త్) డా.శాంతి కుమార్ మిమిక్రీ, గంగమ్మ జాతర చేయనున్నారు.


