News March 2, 2025
నంద్యాల: కనిపించిన నెలవంక.. ప్రారంభమైన రంజాన్ మాసం

ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు ముస్లిం మత పెద్దలు ఖాదర్ వలీ, మహబూబ్ ఖాన్ తదితరులు వెల్లడించారు. దీంతో నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం తెల్లవారుజామున నుంచి ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన ఉపవాస దీక్షలను స్వీకరించనున్నారు.
Similar News
News November 19, 2025
సిరిసిల్ల: అపెరల్ పార్కును సందర్శించిన ఇన్ఛార్జి కలెక్టర్

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్కును ఇన్ఛార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ బుధవారం సందర్శించారు. గ్రీన్ నీడిల్, టెక్స్పోర్ట్ పరిశ్రమలలో వస్త్ర తయారీ దశలను క్షుణ్ణంగా పరిశీలించారు. తయారైన వస్త్రాలను ఎక్కడికి ఎగుమతి చేస్తారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో మాట్లాడి, వారి యోగక్షేమాలను, వారు ఎక్కడి నుంచి వచ్చారో ఆరా తీశారు.
News November 19, 2025
వృద్ధులకు ప్రత్యేక వైద్య సేవలు: మంత్రి దామోదర

దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్య సేవలను విస్తరిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జనరల్ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్వోలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. వృద్ధులకు సేవలు అందించడంలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు.
News November 19, 2025
ఖేడ్: ‘రైతులకు ఆధునిక పరిష్కారం’

ఖేడ్లో జరిగిన బాల వైజ్ఞానిక సదస్సులో గుమ్మడిదల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు తయారు చేసిన ‘రైతు మిత్ర’ అనే పరికరం ఆకట్టుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంట కోత అనంతరం ధాన్యాన్ని ఎండబెట్టుకునే రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఈ సులభమైన యంత్రాన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రైతుల కష్టాన్ని తగ్గించి, వారి పనిని సులభతరం చేసే యంత్రాన్ని అభివృద్ధి చేసినట్లు విద్యార్థులు తెలిపారు.


