News March 10, 2025
నంద్యాల కలెక్టరేట్‌లో నేడు ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల పట్టణం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News February 13, 2026
బంగ్లాదేశ్ ఎన్నికలు.. BNP ఘనవిజయం

బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(BNP) కూటమి ఘన విజయం సాధించింది. 299 స్థానాలకు ఎన్నికలు జరగ్గా 209 సీట్లు సొంతం చేసుకుంది. ప్రధాన పోటీదారు అనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపలేదు. దీంతో ప్రధానిగా తారిఖ్ బాధ్యతలు చేపట్టనున్నారు. కొన్ని గంటల్లో అధికారికంగా ఫలితాలు వెల్లడించనున్నారు.
News February 13, 2026
ఆలస్యంగా వరి నాట్లు.. కలుపు నివారణ

ఆలస్యంగా వరి నాటిన పొలంలో 15-20 రోజుల సమయంలో గడ్డిజాతి కలుపు ఉన్నట్లు గుర్తిస్తే 200 లీటర్ల నీటిలో సైహలోపాప్ బ్యుటైల్ 10% ఇ.సి 400ml ద్రావణం లేదా బిస్‌ఫైరిబాక్ సోడియం 10% S.C ద్రావణం 80ML కలిపి పిచికారీ చేయాలి. అదే అంతర తామర, పిల్లడుగు, గుర్రపుడెక్క వంటి వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉంటే నాటిన 20-25 రోజుల వేళ 200 లీటర్ల నీటిలో ఎకరాకు 2,4 డి.సోడియం సాల్ట్ 80% పొడి 400 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News February 13, 2026
ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా..

TG: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. తర్వాత వార్డుల వారీగా బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేస్తారు. 25 బ్యాలెట్ పత్రాల చొప్పున బండిల్ చేసి వెయ్యి ఓట్ల(ఒక రౌండ్)ను ఒక కట్టగా ఉంచుతారు. ఓట్లను బట్టి రౌండ్ల వారీగా ప్రతీ బ్యాలెట్ పేపర్‌ను ఏజెంట్‌కు చూపిస్తూ లెక్కింపు సాగుతుంది. చివరకు ఫలితాలు ప్రకటిస్తారు.
* ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు Way2Newsను ఫాలో అవ్వండి.


