News March 9, 2025
నంద్యాల కలెక్టరేట్లో రేపు ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల పట్టణం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్ రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Similar News
News September 17, 2025
బ్యాంకింగ్ రుణాల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయండి: జేసీ

జిల్లాలోని రైతులకు పంట రుణాలు, మహిళా గ్రూపులు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు, యువత ఉపాధి రంగానికి అవసరమైన రుణాలను తక్షణమే మంజూరు చేయాలని జేసీ విష్ణు చరణ్ బ్యాంకర్లను సూచించారు. కలెక్టరేట్లో డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది మొత్తం రూ.15,120 కోట్ల వార్షిక రుణ లక్ష్యానికి గాను జూన్ 30 నాటికి రూ.5,360 కోట్లు మాత్రమే సాధించారన్నారు.
News September 17, 2025
BlackBuck సంస్థకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

AP: బెంగళూరు నుంచి తమ ఆఫీసును తరలించాలని అనుకుంటున్నట్లు BlackBuck సంస్థ CEO రాజేశ్ పెట్టిన పోస్టుకు మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ కంపెనీని వైజాగ్కు రీలొకేట్ చేసుకోవాలని కోరారు. ఇండియాలో టాప్-5 క్లీనెస్ట్ సిటీల్లో వైజాగ్ ఒకటని పేర్కొన్నారు. ‘ఆఫీసుకి వచ్చి వెళ్లేందుకు 3hr+ పడుతోంది. 9 ఏళ్లుగా ORR ఆఫీస్+ఇల్లుగా మారింది. ఇక ఇక్కడ ఉండలేం. రోడ్లు గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి’ అని రాజేశ్ పేర్కొన్నారు.
News September 17, 2025
విశాఖలో పార్టనర్షిప్ సమ్మిట్-2025

నవంబర్ 14,15తేదీల్లో విశాఖలో ప్రతిష్టాత్మకంగా పార్టనర్షిప్ సమ్మిట్-2025 నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా లండన్లోని నారా లోకేశ్ గ్లోబల్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం-యుకె బిజినెస్ ఫోరం నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో దూసుకెళ్తున్నామని చెప్పారు. పలు దిగ్గజ కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు.