News July 3, 2024

నంద్యాల కలెక్టర్‌గా శ్రీనివాసులు తనదైన మార్క్..!

image

నంద్యాల జిల్లా కలెక్టర్‌గా డా.కే.శ్రీనివాసులు జిల్లాలో తనదైన మార్క్ వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయన 5 నెలల పాటు జిల్లాకు సేవలందించారు. కలెక్టర్ హోదాలో ఆయనకు నంద్యాల తొలి పోస్టింగ్ కాగా.. జిల్లా రెండో కలెక్టర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలను ఆయన సమర్థవంతంగా నడిపించారు. జూలై 1న పింఛన్ల పంపిణీలో ఆయన కీలకంగా వ్యవహరించారు.

Similar News

News October 7, 2024

డోన్‌: హత్య కేసులో ఐదుగురి అరెస్ట్

image

డోన్‌లోని కొండపేట వాసి షేక్ మదార్‌వలిపై గతనెల17న హత్యాయత్నం చేయగా కర్నూలులో చికిత్స పొందుతూ 26వ తేదీ మృతి చెందారు.ఈ కేసుకు సంబంధించి వ్యక్తిని కొట్టి చంపిన ఐదుగురిని రిమాండ్‌కి పంపినట్లు సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు. వారిని గుత్తిరోడ్డులోని మార్కెట్ యార్డ్ వద్ద ఆదివారం అరెస్ట్ చేశామన్నారు. హరికృష్ణ, చెన్నకేశవులు, రంగమని, మౌలాలి, శివసాయి కలిసి వలిని కర్రలతో, రాడ్లతో కొట్టినట్లు సీఐ తెలిపారు.

News October 7, 2024

అలంపూర్ మా అమ్మమ్మగారి ఊరు: కర్నూలు కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ జోగులాంబ శ్రీబాల బ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు ఆదివారం కర్నూలు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలంపూర్ తన అమ్మమ్మగారి ఊరని, సెలవుల్లో ఇక్కడికి వచ్చి గడిపే వాళ్ళమని. అలంపూర్‌తో తనకున్న జ్ఞాపకాలను కలెక్టర్ నెమరేసుకున్నారు.

News October 7, 2024

శ్రీశైల మల్లన్న క్షేత్రం.. పుష్ప శోభితం!

image

శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉభయ ఆలయాల ప్రధాన ధ్వజస్తంభాలు, ఉపాలయాలను, ముఖద్వారా లను వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన రకరకాల పూలతో స్వామి అమ్మవార్ల ప్రతిబింబాలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఈ పుష్పాలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.