News September 13, 2024
నంద్యాల: కుందూ నదిలో ఇద్దరు గల్లంతు
కోయిలకుంట్ల మండలం కలుగొట్ల సమీపంలోని కుందూ నదిలో గురువారం సాయంత్రం ఇద్దరు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన రామసుబ్బారెడ్డి జీవితంపై విరక్తి చెంది నదిలో దూకి గల్లంతయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన బాలగురప్ప తన సమీప బంధువు కర్మకాండకు నది వద్దకు వచ్చి స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. పోలీసులు గాలిస్తున్నారు.
Similar News
News October 14, 2024
KNL: నేడే లాటరీ.. తీవ్ర ఉత్కంఠ..!
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కొత్తగా నెలకొల్పనున్న (కర్నూలు-99, నంద్యాల-105) మద్యం దుకాణాల నిర్వహణకు ఇవాళ టెండర్లు నిర్వహించనున్నారు. దీంతో దరఖాస్తుదారుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్నూలుకు సంబంధించి జడ్పీ సమావేశ మందిరంలో, నంద్యాలకు సంబంధించి కలెక్టరేట్ సెంటినరీ హాల్లో లాటరీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల ఎస్పీలు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
News October 14, 2024
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్
భారీ వర్షాలు పడే అవకాశాలు ఉండటంతో కలెక్టరేట్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. ఆదివారం అధికారులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. ఏ సమస్య ఉన్నా కమాండ్ కంట్రోల్ రూమ్ 08518-277305కు ఫోన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
News October 13, 2024
ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదు: కర్నూలు ఎస్పీ
కర్నూలు (D) హోలగుంద మండల పరిధిలోని దేవరగట్టులో శనివారం రాత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కర్రల సమరం శాంతియుతంగా ముగిసిందని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోలేదని, 60 మందికి చిన్నపాటి గాయాలైనట్లు గుర్తించామని పేర్కొన్నారు. సంబరంలా వేడుకలు జరిగాయని అన్నారు. పోలీస్ అధికారులకు, సిబ్బందికి, ఇతర శాఖల వారికి, మీడియాకు ఆయన అభినందనలు తెలిపారు.