News September 12, 2024

నంద్యాల: కూతురుకి వింత వ్యాధి.. తల్లిదండ్రుల ఆవేదన

image

నంద్యాల జిల్లా జూపాడు బంగ్లాకు చెందిన నాగేశ్వరరావు, లక్ష్మీదేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్ద కొడుకు రవికుమార్ గతేడాది జూలైలో విల్సన్ అనే వింత వ్యాధికి గురై, కాలేయంలో రాగి నిల్వలు పేరుకుపోయి పదేళ్ల వయసులో మరణించాడు. రెండో సంతానం అయిన విజయలక్ష్మికీ అదే వ్యాధి సోకింది. కుమార్తె కూడా తమకు దక్కదని, వైద్యం కోసం రూ.40 లక్షలు అవసరమని ఆవేదన చెందుతున్నారు.

Similar News

News October 3, 2024

ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి: కలెక్టర్

image

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నిర్దేశించిన పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ జీ.రాజకుమారి ఎంపీడీవోలు, ఏపీఓలు, క్షేత్రస్థాయి సిబ్బంది ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. దినసరి సరాసరి కూలి వేతన చెల్లింపులో దిగువ స్థానంలో ఉన్నామని వేతన కూలి రేటు పెంచేందుకు ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవాలన్నారు.

News October 3, 2024

సైబర్ నేరాల కట్టడికి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి: ఎస్పీ

image

కర్నూలులోని ప్రభుత్వాసుపత్రులు, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ జీ.బిందు మాధవ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొరియర్ అని, లాటరీ తగిలిందని, డిజిటల్ అరెస్టు పేరుతో విడియో కాల్స్ చేస్తూ మోసాలు చేస్తున్నాయని, జాగ్రత్త వహించాలన్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోపే 1930కి ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.

News October 3, 2024

టెట్ పరీక్షకు 145 మంది గైర్హాజరు

image

కర్నూలు జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన టెట్ పరీక్షకు 145 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ వెల్లడించారు. ఉదయం జరిగిన పరీక్షలో 551 మంది అభ్యర్థులు హాజరు కాగా.. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 556 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని తెలిపారు.