News October 10, 2024
నంద్యాల: కొబ్బరి బొండంపై నవదుర్గల చిత్రాలు
ఆళ్లగడ్డకు చెందిన ఆర్టిస్టు విజయ్ అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు. దుర్గాష్టమి పర్వదినం సందర్భంగా కొబ్బరి బొండంపై నవదుర్గ మాతల చిత్రాలను అక్రిలిక్ రంగులతో తీర్చిదిద్దారు. ఆది పరాశక్తి జగజ్జనని 9 రూపాలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహా గౌరి, సిద్ధిధాత్రి అమ్మవార్ల చిత్రాలను చిత్రీకరించారు.
Similar News
News December 22, 2024
రోడ్డు ప్రమాదంలో నర్సు మృతి
దోర్నాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీశైల దేవస్థానం వైద్యశాల నర్సు మల్లిక మృతి చెందారు. శ్రీశైలానికి చెందిన ఆమె.. భర్త, పాపతో కలిసి కర్నూలుకు షాపింగ్ నిమిత్తం నిన్న వెళ్లారు. రాత్రి పుష్ప-2 సినిమా చూసి, తిరుగు పయనమయ్యారు. తెల్లవారుజామున మంచు కారణంగా వారు ప్రయాణిస్తున్న కారు టూరిస్ట్ బస్సును ఢీకొంది. మల్లిక అక్కడికక్కడే మృతి చెందగా.. ఆమె భర్త, పాపకు ఏమీ కాలేదని వారి సన్నిహితులు తెలిపారు.
News December 22, 2024
కర్నూలు: క్లాస్‌రూములో ఉండగానే టీచర్ కిడ్నాప్..?
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం అల్లుగుండు ప్రభుత్వ పాఠశాలలో టీచర్ మునీర్ అహ్మద్ కిడ్నాప్ అయినట్టు తెలుస్తోంది. క్లాస్ రూములో ఉండగానే కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మునీర్ అహ్మద్ కిడ్నాప్ కావడం ఇది మూడోసారి అని, కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక రూ.20 కోట్లు విలువ చేసే భూ వివాదంలో కిడ్నాప్ చేశారని ఆరోపిస్తున్నారు. మునీర్ అహ్మద్ సోదరుడు మక్బూల్ బాషా కూడా కనిపించడం లేదని అంటున్నారు.
News December 22, 2024
గుండెపోటుతో పాత్రికేయుడి మృతి
గడివేముల మండల విలేకరి మహబూబ్ బాషా గుండెపోటుతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. 4 రోజుల నుంచి అస్వస్థతతో చికిత్స తీసుకుని కోలుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ‘Iam Back’ అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టారు. అయితే నేడు అకాల మరణంతో కుటుంబ సభ్యులు, తోటి విలేకరులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈయన APUWJ సభ్యుడిగా పాత్రికేయ
రంగానికే వన్నెతెచ్చిన వ్యక్తిగా పేరు గడించారని పలువురు విలేకరులు కొనియాడారు.