News April 2, 2025
నంద్యాల: క్రీడకారులకు ఆరు వారాల సర్టిఫికెట్ కోర్స్

ఏపీ ప్రభుత్వ రాష్ట్ర క్రీడా అధికార సంస్థ ఆదేశాల మేరకు మే 6 నుంచి జూలై 2 వరకు ఆరు వారాల certificate course- 2025 నిర్వహిస్తున్నట్లు బుధవారం జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం ఎన్ వి రాజు తెలిపారు. ఈ కోర్స్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.6wcc.nsnis.in వెబ్‌సైట్ ద్వారా ఈనెల 14వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News April 15, 2025
వనపర్తి: పోక్సో యాక్ట్‌పై అవగాహన

రాజ్యాంగం మనకు అనేక రకాలైన హక్కులను కల్పిస్తుందని డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అడ్వకేట్ ఉత్తరయ్య అన్నారు. వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని సూచన మేరకు సోమవారం వనపర్తి, పెద్దమందడి మండలాల్లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, మోటార్ వెహికల్ యాక్ట్‌పై ఆయన అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు.
News April 15, 2025
వనపర్తి: వేలిముద్రలు పడటం లేదని బియ్యం ఇవ్వడం లేదు: బుచ్చమ్మ

చేతి వేలిముద్రలు కంప్యూటర్‌లో పడటం లేదని రేషన్ షాపులో ఉచిత బియ్యం ఇవ్వటం లేదని పానగల్ మండలం కేతేపల్లికి చెందిన తెలుగు బిచ్చమ్మ తెలిపారు. రేషన్ కార్డులో తన ఒక్క పేరే ఉందన్నారు. వృద్ధాప్యం వల్ల వేలిముద్రలు చెరిగిపోయాయని చెప్పారు. కంప్యూటర్లో వేలిముద్రలు నమోదు అయితేనే బియ్యం వస్తాయని చెబుతూ, కొన్నాళ్లుగా ఇవ్వటం లేదని బియ్యం ఇప్పించాలని, అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
News April 15, 2025
ఏటూరునాగారం: వరి పంటను చూసి కన్నీరు పెట్టిన రైతులు

ఏటూరునాగారం మండల వ్యాప్తంగా ఆదివారం కురిసిన ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో వరిపంట నేల వాలిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన చిన్నదుర్గయ్య అనే రైతు అప్పుతెచ్చి పెట్టుబడి పెట్టి వరి పంటను సాగు చేశాడని, ఆదివారం వడగళ్ల వర్షం కురవడంతో వరిపంట, వడ్లు రాలిపోయాయని కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.