News March 22, 2025
నంద్యాల: క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్పై సమావేశం

నంద్యాల జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా క్రైమ్, క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్పై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. నేరాల నియంత్రణలో CCTV కెమెరాల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని వారు తెలిపారు. మహిళలపై, చిన్నారులపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రౌడీయిజం తగ్గించే దిశగా రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందికి సూచించారు.
Similar News
News December 8, 2025
ములుగు జిల్లాలో గెలుపోటములు నిశ్చయించేది ‘ఆమె’నే..!

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ములుగు జిల్లా ఫైనల్ ఓటర్ జాబితాను అధికారులు ప్రకటించారు. మొత్తం 1,89,790 మంది ఓటర్లు ఉండగా మహిళలే 98,386 మంది ఉన్నారు. పురుషుల సంఖ్య 91,386. ఇతరులు 18మంది ఉన్నారు. అత్యధికంగా వెంకటాపూర్ మండలంలో 28,236 మంది.. అత్యల్పంగా కన్నాయిగూడెం మండలంలో 9,992 మంది ఓటర్లు ఉన్నారు. మూడు విడతల్లో జరిగే ఎన్నికల్లో గెలుపోటములను మహిళలే నిర్ణయిస్తారు.
News December 8, 2025
NGKL: సోషల్ మీడియాపై పోలీసుల నిఘా: ఎస్పీ

నాగర్ కర్నూల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి మాధ్యమాల్లో ఇతరులను రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా పోస్ట్లు పెట్టి, గొడవలు సృష్టించే వారిపై, గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News December 8, 2025
ఉత్తమ ఫలితాలు సాధించాలి: సూర్యాపేట కలెక్టర్

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ప్రతి సబ్జెక్టులో కనీసం 70 శాతానికి పైగా మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ విద్యార్థులను కోరారు. చిన్ననేమిల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్లో చదువుకుంటున్న విద్యార్థులతో సిలబస్ పూర్తి అయిందా?, వార్షిక పరీక్షలకు ఎలా చదువుకోవడానికి ప్రణాళికలు రూపొందించుకున్నారు, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.


