News September 11, 2024
నంద్యాల: గుండెపోటుతో వైసీపీ నేత మాతృమూర్తి మృతి

బనగానపల్లె నియోజకవర్గ వైసీపీ నాయకుడు కాటసాని ప్రసాద్ రెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రసాద్ రెడ్డి మాతృమూర్తి కాటసాని ఈశ్వరమ్మ(73) బుధవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. స్వగ్రామం అవుకు మండలం గుండ్లసింగవరంలో సాయంత్రం 4 గంటలకు అంతక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News July 11, 2025
పెట్టుబడి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

తక్కువ సమయంలో అధిక లాభాలు ఇస్తామని ప్రలోభ పెట్టే మోసగాళ్ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేకంగా టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలను టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఇటీవలి కాలంలో కర్నూలు జిల్లాలో కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు.
News July 10, 2025
విద్య భవిష్యత్తును నిర్ణయిస్తుంది: మంత్రి భరత్

విద్య భవిష్యత్తును నిర్ణయిస్తుందని మంత్రి టీజీ భరత్ అన్నారు. గురువారం కర్నూలులోని టౌన్ మోడల్ హైస్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. మంత్రి లోకేశ్ విద్యా వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు.
News July 10, 2025
డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే లక్ష్యం: ఈగల్ ఐజీ

డ్రగ్స్, గంజాయి రహిత సమాజమే మన ముందున్న లక్ష్యమని ఈగల్ ఐజీ రవికృష్ణ అన్నారు. గురువారం కప్పట్రాళ్లలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌కు ఎస్పీ విక్రాంత్ పాటిల్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. రవికృష్ణ మాట్లాడుతూ.. పిల్లలు భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు. అనంతరం గతేడాది 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు.