News August 27, 2024

నంద్యాల: గూడ్స్ ఆటో, కారు ఢీ.. చల్లాచెదురైన సామన్లు

image

పాణ్యంలోని భారత్ పెట్రోల్ బంకు సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్టీలు సామన్లతో వెళ్తున్న గూడ్స్ ఆటో, కారు ఢీకొనడంతో కారు డిక్కీ పూర్తిగా దెబ్బతింది. గూడ్స్ ఆటోలోని స్టీల్ సామన్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదంలో ఆటో డ్రైవర్ గాయపడినట్లు స్థానికులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 12, 2025

ఆదోనిలో లారీ బోల్తా.. భయంతో డ్రైవర్ ఆత్మహత్య

image

ఆదోని మండల పరిధిలోని బైచిగేరి క్రాస్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదోని నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ లక్ష్మన్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

News December 12, 2025

ఆర్యవైశ్యులు ఎప్పటికీ సీఎం చంద్రబాబుతోనే: మంత్రి టీజీ

image

సీఎం చంద్ర‌బాబు నాయుడు ఆర్య‌వైశ్యుల‌కు స‌ముచిత గౌర‌వం క‌ల్పిస్తున్నార‌ని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ అన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ప‌.గో జిల్లా పెనుగొండ పేరును వాస‌వీ పెనుగొండ‌గా సీఎం మార్పు చేశార‌ని, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న వైశ్యుల త‌రఫున సీఎంకు కృత‌జ్ఞత‌లు తెలుపుతున్నాన‌న్నారు. సీఎం చంద్ర‌బాబుకు ఆర్య‌వైశ్యులు ఎప్ప‌టికీ అండగా ఉంటారని మంత్రి పేర్కొన్నారు.

News December 12, 2025

కర్నూలు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్‌గా నాగేంద్ర

image

తుగ్గలి గ్రామానికి చెందిన తుగ్గలి నాగేంద్రను కర్నూలు జిల్లా గ్రంధాలయ ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్‌కు నాగేంద్ర ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.