News October 10, 2024
నంద్యాల చిత్రకారుడి ప్రతిభ.. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపం

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ మరోసారి తన టాలెంట్ చూపెట్టారు. చిటికెన వేలుపై సాయిబాబా ప్రతిరూపాన్ని చిత్రీకరించి అబ్బురపరిచారు. బాబాపై ఉన్న భక్తి, ప్రేమతో ఈ చిత్రాన్ని వేసినట్లు ఆయన తెలిపారు. ‘సబ్ కా మాలిక్ ఏక్ హై’ అన్న నినాదం ఈ చిత్రంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుందని, ప్రస్తుత సమాజానికి బాబా బోధనలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. ఈ చిత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
Similar News
News October 15, 2025
కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

రేపు ప్రధాని <<18009233>>మోదీ<<>> కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.
News October 15, 2025
కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

రేపు ప్రధాని మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.
News October 15, 2025
మగపిల్లలు పుట్టలేదని వ్యక్తి సూసైడ్

ఆదోని పరిధిలోని మదిరే వాసి గంపల సోమ(31) రైలు కిందపడి మంగళవారం మృతిచెందాడు. మగ పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇస్వీ ఆర్ఎస్ 501/18 సమీపంలో మధ్యాహ్నం గూడ్స్ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.