News January 6, 2025
నంద్యాల: జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ

కుష్టి వ్యాధి నిర్ధారణ కోసం ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ ఎస్‌లో భాగంగా కుష్టి వ్యాధి నిర్మూలన గోడ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 85 మంది కొత్త రోగులను గుర్తించి వారికి చికిత్స అందించినట్లు స్పష్టం చేశారు.
Similar News
News November 19, 2025
డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం: ఎస్పీ

డిజిటల్ అరెస్ట్ అంటేనే మోసం అని, అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. సైబర్ నేరగాళ్లు పోలీసులు/సీబీఐ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేసి భయపెట్టడం, వివరాలు తీసుకుని డబ్బులు దోచుకోవడం వంటి కేసులు పెరుగుతున్నాయన్నారు. పోలీసులు ఎప్పుడూ వీడియో కాల్ చేయరని, ఫోన్‌లో డబ్బులు అడగరని స్పష్టం చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1930కి లేదా Kurnool Cyber Policeను సంప్రదించాలన్నారు.
News November 19, 2025
నేడే రైతు ఖాతాలో 2వ విడత నగదు జమ: కలెక్టర్

అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత కింద ఇవాళ (మంగళవారం) రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేయనుందని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలు, రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ పథకం కార్యక్రమం జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ఆదేశించారు.
News November 18, 2025
పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఆదోనిలోని NDBL జిన్నింగ్ & ప్రెస్సింగ్, దాదా పీర్ మిల్ యూనిట్లలో CCI ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. స్థానిక మార్కెట్ యార్డ్ అధికారులతో కలిసి కోనుగోలు కేంద్రాల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారన్న వాటిపై ఆరా తీశారు. అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించా. ఆమెతో పాటు జిల్లా వ్యవసాయ అధికారిణి వరలక్ష్మీ ఉన్నారు.


