News January 6, 2025
నంద్యాల: జాతీయ కుష్టి వ్యాధి నిర్మూలన పోస్టర్ ఆవిష్కరణ
కుష్టి వ్యాధి నిర్ధారణ కోసం ఈనెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఇంటింటి సర్వే కార్యక్రమం చేపట్టినట్లు కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ ఎస్‌లో భాగంగా కుష్టి వ్యాధి నిర్మూలన గోడ పత్రికను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. నంద్యాల జిల్లాలో ఈ సంవత్సరం ఇప్పటివరకు 85 మంది కొత్త రోగులను గుర్తించి వారికి చికిత్స అందించినట్లు స్పష్టం చేశారు.
Similar News
News January 22, 2025
కర్నూలు: ముగ్గురు విద్యార్థుల మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, వాహన డ్రైవర్ మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ప్రమాద ఘటన తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యా. విద్యార్థులు హంపిలో ఆరాధనకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.
News January 22, 2025
మంత్రాలయం విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులు మృతి చెందడంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
News January 22, 2025
ఏపీ బీజేపీ చీఫ్ రేసులో ఆదోని ఎమ్మెల్యే!
ఏపీ బీజేపీకి త్వరలో కొత్త చీఫ్‌ను ప్రకటించే ఛాన్సుంది. సుమారు 10 మంది నేతలు ఈ పదవి కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం. అందులో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి రేసులో ముందున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మరికొన్ని రోజుల్లో అధ్యక్షుడి ఎంపికపై క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ నెలాఖరుకు కొత్త చీఫ్‌ను ప్రకటిస్తారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.