News March 11, 2025
నంద్యాల జిల్లాకు చేరిన 10వ తరగతి ప్రశ్న పత్రాలు.!

పదవ తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలు మంగళవారం నంద్యాల జిల్లాకు చేరాయి. రుద్రవరం పరిధిలోని కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలకు చెందిన ఈ ప్రశ్నా పత్రాలను, పాఠశాల HM సుబ్బరాయుడు, పరీక్షల నిర్వహణ చీఫ్ అనురాధ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ బాలగురప్ప PSకు తరలించి భద్రపరిచారు. ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
Similar News
News September 16, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 16, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.04 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.11 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.34 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
✒ ఇష: రాత్రి 7.30 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News September 16, 2025
VZM: మహిళల ఆరోగ్య పరిరక్షణకు వరం

మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం ఎంతో దోహదం చేస్తుందని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ అన్నారు. ఈ పథకానికి సంబంధించి గోడ పత్రికను ఆయన కలెక్టరేట్లో సోమవారం ఆవిష్కరించారు. దీని ద్వారా వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైనవారికి తగిన వైద్య సదుపాయాన్ని అందించాలని సూచించారు.
News September 16, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.