News March 11, 2025

నంద్యాల జిల్లాకు చేరిన 10వ తరగతి ప్రశ్న పత్రాలు.!

image

పదవ తరగతికి సంబంధించిన ప్రశ్న పత్రాలు మంగళవారం నంద్యాల జిల్లాకు చేరాయి. రుద్రవరం పరిధిలోని కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాలకు చెందిన ఈ ప్రశ్నా పత్రాలను, పాఠశాల HM సుబ్బరాయుడు, పరీక్షల నిర్వహణ చీఫ్ అనురాధ, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ బాలగురప్ప PSకు తరలించి భద్రపరిచారు. ఈనెల 17వ తేదీ నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

Similar News

News March 14, 2026

తానూర్‌లో దొంగల బీభత్సం

image

తానూర్ మండలంలోని బోసి గ్రామంలో శనివారం తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. ఎస్సై షేక్ జుబేర్ వివరాల ప్రకారం.. అర్జాపూర్ గంగాధర్ కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో దుండగులు ఇంటి తాళం పగలగొట్టి రూ.79 వేల నగదు ఎత్తుకెళ్లారు. సాయినాథ్ అనే వ్యక్తి ఇంట్లో నిద్రిస్తుండగా రూ.1000 నగదు దొంగిలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేశారు.

News March 14, 2026

జిల్లాస్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ ఏర్పాటు: కలెక్టర్

image

జిల్లాలో వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా జరిగేలా చూసేందుకు ‘జిల్లా స్థాయి ఎనర్జీ సప్లై మానిటరింగ్ కమిటీ’ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సీఎస్ సూచనల మేరకు తన అధ్యక్షతన ఈ కమిటీ పని చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఎస్పీ, అదనపు కలెక్టర్, ఆయిల్ కంపెనీల మేనేజర్లు, ఆర్‌టీఓ, డిఎంహెచ్ఓ సభ్యులుగా ఉంటారని, గ్యాస్ కొరత లేకుండా నిరంతరం పర్యవేక్షిస్తారని వివరించారు.

News March 14, 2026

మంచిర్యాల: జిల్లాలో గ్యాస్ కొరత లేదు

image

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎల్పిజీ సిలిండర్లు సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో డీసీపీ భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్యాస్ సిలిండర్ల కొరతలేదని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఎల్పీజీ డీలర్లతో సమావేశం నిర్వహించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసి సమీక్షించారు.