News February 26, 2025

నంద్యాల జిల్లాకు జబర్దస్త్ నటుడి రాక

image

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌తో పాటు, పలు నాటక ప్రదర్శనలు, సినిమాల్లో కామెడీ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రజలను మెప్పిస్తున్న జబర్దస్త్ నటుడు అప్పారావు నేడు (బుధవారం) కొలిమిగుండ్ల మండలం పెట్నికోటకు రానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెట్నికోట శ్రీ గుండు మల్లేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి చింతామణి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో అప్పారావు సుబ్బిశెట్టి పాత్ర వేస్తున్నారు.

Similar News

News February 28, 2026

కాకినాడలో భారీ పేలుడు.. హుటాహుటిన బయలుదేరిన హోంమంత్రి అనిత

image

కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి సుమారు 20 మంది సజీవ దహనం ఆయన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు ఆదేశాలతో విజయనగరం జిల్లా చీపురుపల్లి పర్యటనలో ఉన్న హోంమంత్రి అనిత హుటాహుటిన ఘటనా స్థలికి పయనమయ్యారు. ఇప్పటికే అక్కడ అధికారులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.

News February 28, 2026

కర్నూలు: ‘ఏప్రిల్ నాటికి 23,077 గృహాలకు సోలార్’

image

కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్లతో జిల్లా కలెక్టర్ సిరి సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్యఘర్ పథకం కింద జిల్లాలోని 23,077 ఎస్సీ/ఎస్టీ లబ్ధిదారుల ఇళ్లపై ఏప్రిల్ నాటికి సోలార్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇన్వర్టర్లు, మీటర్లు, ఎర్త్ వైరింగ్‌లో నాణ్యత పాటించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న పీఎం కుసుమ్ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.

News February 28, 2026

సిద్దిపేట నుంచే కవిత కొత్త పార్టీ?

image

సిద్దిపేట కేంద్రంగా కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం సిద్దిపేటలో పార్టీ కార్యాలయం, నివాసం ఏర్పాటుకు స్థల పరిశీలన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.