News February 26, 2025

నంద్యాల జిల్లాకు జబర్దస్త్ నటుడి రాక

image

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌తో పాటు, పలు నాటక ప్రదర్శనలు, సినిమాల్లో కామెడీ ఆర్టిస్టుగా నటిస్తూ ప్రజలను మెప్పిస్తున్న జబర్దస్త్ నటుడు అప్పారావు నేడు (బుధవారం) కొలిమిగుండ్ల మండలం పెట్నికోటకు రానున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెట్నికోట శ్రీ గుండు మల్లేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి చింతామణి నాటక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో అప్పారావు సుబ్బిశెట్టి పాత్ర వేస్తున్నారు.

Similar News

News July 6, 2025

ఊపిరి పీల్చుకున్న జపాన్

image

‘జపాన్ బాబా వాంగా’ <<16947282>>ర్యొ టట్సుకి<<>> జోస్యం చెప్పినట్లుగా ఇవాళ (జులై 5) జపాన్‌లో ఎలాంటి ప్రళయం సంభవించలేదు. అక్కడ 6వ తేదీ రావడంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేశంలో చిన్న భూకంపాలు తప్ప ఎలాంటి సునామీ రాలేదు. దీంతో టట్సుకి భవిష్యవాణి నిరాధారమైందని అక్కడి మేధావులు, సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ర్యొ టట్సుకి జోస్యంతో జపాన్‌లో ప్రళయం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.

News July 6, 2025

ఎన్టీఆర్: పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఇటీవల నిర్వహించిన బీఈడీ, స్పెషల్ బీఈడీ, LLM 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ANU విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

News July 6, 2025

ప్ర‌చార ర‌థం ప్రారంభమయ్యేది అప్పుడే

image

జులై 9న మ‌.2 గంట‌ల‌కు సింహాచలం గిరిప్రదక్షిణ ప్ర‌చారర‌థం ప్రారంభమవుతుందని ఈవో త్రినాథ‌రావు కలెక్టర్‌కు వివరించారు. తొలిపావంచా వ‌ద్ద అశోక్ గ‌జ‌ప‌తి చేతుల మీదుగా ప్ర‌చారర‌థం ప్రారంభ‌మ‌వుతుంద‌న్నారు. ఆరోజు రాత్రి 11 గంట‌లకు ర‌థం ఆల‌యానికి చేరుకుంటుంద‌ని, మరుసటి రోజు ఉ.5 నుంచి స్వామివారి ద‌ర్శ‌నాలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని పేర్కొన్నారు.10వ తేదీ సాయంత్రం 7వ‌ర‌కు ద‌ర్శ‌నాలు ఉంటాయన్నారు.