News March 21, 2025
నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన

నంద్యాల జిల్లాల్లో ఈనెల 23న చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని గురువారం ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. వ్యవసాయ కూలీలు పొలాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరింది. కాగా మరోవైపు జిల్లాలో గత కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతున్న తరుణంలో వర్ష సూచన శుభవార్త అనే చెప్పవచ్చు.
Similar News
News December 9, 2025
సోనియా గాంధీకి కోర్టు నోటీసులు

కాంగ్రెస్ నేత సోనియా గాంధీకి ఢిల్లీ కోర్టు నోటీసులిచ్చింది. 1983 ఏప్రిల్లో ఇండియన్ సిటిజన్షిప్ రావడానికి మూడేళ్ల ముందే ఎలక్టోరల్ రోల్లో పేరు నమోదైనట్టు ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్పై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. 2026, జనవరి 6వ తేదీన ఈ పిటిషన్పై మరోసారి విచారణ జరుపుతామని స్పెషల్ జడ్జి జస్టిస్ విశాల్ గోనె తెలిపారు. ఢిల్లీ పోలీసులకు కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది.
News December 9, 2025
సూర్యాపేటలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ

సూర్యాపేట సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, మెప్మా మహిళలు, ఆశా వర్కర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు సమర్పించిన అనంతరం అందరూ సమూహంగా “జయ జయహే తెలంగాణ” గీతాన్ని ఆలపించారు.
News December 9, 2025
బాపట్లలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

బాపట్లలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని చీలు రోడ్డు వద్ద లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న శివరామకృష్ణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.


