News January 29, 2025
నంద్యాల జిల్లాకు మరో 11 మద్యం షాపులు

నంద్యాల జిల్లాకు ప్రభుత్వం మరో 11 మద్యం దుకాణాలు కేటాయించినట్లు జిల్లా ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ వీ.రాముడు ఓ ప్రకటనలో వెల్లడించారు. వీటిలో ఈడిగ సబ్ క్యాస్ట్ కులస్థులకు 7, గౌడ్స్‌కు 3, గౌడ కులానికి చెందిన వారికి ఒకటి కేటాయించారని తెలిపారు. అర్హత కలిగిన వారు రూ.2లక్షల చొప్పున ఆన్‌లైన్లో చెల్లించి, వచ్చేనెల 5వ తేదీ నుంచి మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
Similar News
News February 14, 2025
సిద్దిపేట: టీజీఐఐసీ భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

జిల్లాలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటేడ్ (TGIIC) వారికీ కేటాయించిన భూముల భూసేకరణ వేగంగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ఎం.మను చౌదరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
News February 14, 2025
స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి తెచ్చేందుకు కృషి: శ్రీనివాస వర్మ

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే ఆలోచన లేదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ పునరుద్ఘాటించారు. కొన్ని కారణాల వల్ల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉందని, దాన్ని లాభాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.11,400కోట్ల ప్యాకేజీని కేంద్రం ఇచ్చిందని గుర్తుచేశారు. CM CBN, మంత్రి లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్నారు. స్టీల్‌ప్లాంట్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
News February 14, 2025
మర్రిగూడ: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయంపై శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సరంపేట గ్రామానికి చెందిన ఓ రైతు ఎనిమిది గుంటల భూమి సర్వే విషయంపై సర్వేయర్ రవి నాయక్‌ను సంప్రదించగా.. అతడు రూ.15వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఇవాళ మధ్యాహ్నం కార్యాలయంలో రవి రూ.12వేలు లంచం తీసుకుంటుండగా అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.