News November 28, 2024
నంద్యాల జిల్లాకు వర్ష సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాయలసీమలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో ఈ నెల 30, డిసెంబర్ 1వ తేదీన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Similar News
News November 28, 2024
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రం అభివృద్ధి: కలెక్టర్
తిరుమల తరహాలో శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు సమగ్ర వివరాలతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు నివేదికలు ఇవ్వాలని కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో శ్రీశైల మహాక్షేత్ర అభివృద్ధిపై జేసీ సీ.విష్ణు చరణ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అధికారి రాము నాయక్, తదితర అధికారులు ఉన్నారు.
News November 28, 2024
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: కలెక్టర్
పదో తరగతి విద్యార్థులపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్లోని విద్యాశాఖ కార్యాలయంలో పదో తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వర్చువల్ రూమ్‌ను ఆయన పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు వర్చువల్ విధానం ద్వారా నాణ్యమైన బోధన అందించాలని సూచించారు.
News November 28, 2024
జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దాం: టీడీపీ
సంఘసంస్కర్త, సామాజికవేత్త మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను సాధిద్దామని టీడీపీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్ అన్నారు. పూలే వర్ధంతి సందర్భంగా గురువారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి నివాళులు అర్పించారు. ప్రభాకర్ మాట్లాడుతూ.. సమాజిక వర్గ విభేదాలను రూపుమాపేందుకు పూలే పోరాటం సలిపారన్నారు.