News April 2, 2025
నంద్యాల జిల్లాకు వర్ష సూచన

నంద్యాల జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ (APSDMA) పేర్కొంది. కాబట్టి రైతులు, కూలీలు, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అంతే కాకుండా వర్షాలు పడే సమయంలో, రైతులు పొలాల్లోని చెట్ల కింద ఉండరాదని, వాతావరణంలో మార్పులు రాగానే ఇళ్లకు చేరుకోవాలని హెచ్చరించింది.
Similar News
News April 17, 2025
కోడుమూరు: రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

కోడుమూరు మండలం వర్కూరు గ్రామం సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద గురువారం రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెల్తుర్ధి మండలం శ్రీరంగపురానికి చెందిన వెంకటరాముడి మృతి చెందాడు. ఇరు బైక్‌ల మీద ఉన్న అరవింద్, వేణులు, బదినేహాల్ వాసులు షాషావలి, దాదపీరాలు నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స కోసం కర్నూలు తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 17, 2025
పాడేరు: హాట్ బజార్స్ నిర్మాణాలపై సమీక్ష

హాట్ బజార్స్ భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఐటీడీఏ ఏపీవోలు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు ఆదేశించారు. ఐటీడీఏలో జీసీసీ, వెలుగు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో 44 హాట్ బజార్స్ మంజూరయ్యాయని చెప్పారు. ప్రతి మండలానికి ఒక మినీ సూపర్ బజార్ మంజూరు అయిందిని తెలిపారు.
News April 17, 2025
జేఈఈ మెయిన్ ఫైనల్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్ సెషన్ 2 <