News February 3, 2025
నంద్యాల జిల్లాకు సోలాల్ ప్రాజెక్టు

రాయలసీమకు రూ.1.52లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. వేల మందికి ఉద్యోగాలు లభిస్తామని తెలిపారు. కర్నూలులో ఏజీ జెన్కో, ఎన్హెచ్టీసీ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చాయని వివరించారు. కడప, నంద్యాల జిల్లాల్లో SAEL సోలాల్ ఎంహెచ్పీ-2 రూ.1,728 కోట్లతో ప్రాజెక్టు ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఇక ఓర్వకల్లుకు వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.
Similar News
News October 14, 2025
బిహార్ ఎలక్షన్స్.. బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. 71మంది అభ్యర్థులతో లిస్ట్ను విడుదల చేసింది. డిప్యూటీ సీఎంలు సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ సిన్హా లఖిసరాయ్ నుంచి పోటీ చేయనున్నారు. పూర్తి లిస్ట్ కోసం ఇక్కడ <
News October 14, 2025
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సభ్యులు

అంపరేషన్ చేయూత ద్వారా నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 81,141CRPF బెటాలియన్ అధికారుల ఆధ్వర్యంలో లొంగిపోయారని తెలిపారు. ఇప్పటివరకు 326 మంది లొంగిపోయారని చెప్పారు. లొంగిపోయిన పాపారావు, బండి కోస, పద్దం లక్మా, మడివి లక్మ, దొడ్డి బద్రులకు ఎస్పీ తక్షణ సహాయంగా రూ.25 వేలు అందజేశారు.
News October 14, 2025
విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం

APలోని విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్ అవడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయి. AI, టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తిమంతమైన ఆయుధంగా పనిచేయనుంది. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుంది’ అని ట్వీట్ చేశారు.