News April 15, 2025

నంద్యాల జిల్లాలో ఇద్దరు దొంగల అరెస్ట్

image

నంద్యాలలో గత కొన్ని నెలలుగా దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా తెలిపారు. మద్దికేర గ్రామానికి చెందిన దూదేకుల షాహిద్, పందిపాడు గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరిని సోమవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఒంటరి మహిళలే వీరి టార్గెట్ అని తెలిపారు.

Similar News

News October 22, 2025

కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

image

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.

News October 22, 2025

అక్కన్నపేట: విద్యుత్ స్తంభమెక్కిన పొదలు

image

అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపై వెలుగుతున్న వీధి దీపానికి చెట్టు తీగ స్తంభం పైకి ఎక్కింది. వెలుతురును కనపించని విధంగా తీగ వీధి దీపం చుట్టూ అలుముకుంది. దీనిని చూసిన పలువురు విద్యుత్ దీపానికి కంచె మాదిరిగా ఉందంటూ సంభాషించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వెలుతురుకు అడ్డుగా ఉన్న తీగను అధికారులు తొలగించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

News October 22, 2025

తిరుపతి: శైవక్షేత్రం దర్శనం.. కార్తీక మాస పుణీతం

image

పవిత్రమైన కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ శివాలయాలను గురించి తెలుసుకుందాం.
➤ శ్రీకాళహస్తి శ్రీ వాయిలింగేశ్వర స్వామి
➤ గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి
➤ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి
➤ జీవకోన శ్రీ జీవలింగేశ్వర స్వామి
➤ యోగి మల్లవరం పరశారేశ్వర స్వామి
➤ వెదల్లచెరువు శివాలయం
తదితర ఆలయాల్లో విశేష ఉత్సవాలు జరగనున్నాయి.