News May 4, 2024
నంద్యాల జిల్లాలో ఈ సెగ్మెంట్ సమస్యాత్మకం: సీఈఓ
ఏపీలో 14 అసెంబ్లీ సెగ్మెంట్లు సమస్యాత్మకమైనవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇందులో నంద్యాల (D) ఆళ్లగడ్డ నియోజకవర్గ అసెంబ్లీ స్థానం ఒకటిగా ఆయన పేర్కొన్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో 100% వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. పోలీసులు, కేంద్ర బలగాలతో కూడిన భారీ భద్రత నడుమ ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఈఓ స్పష్టం చేశారు.
Similar News
News November 5, 2024
రాబోయే రోజుల్లో వైసీపీ షటిల్ టీం అవుతుంది: ఎమ్మెల్యే బీవీ
రాబోయే రోజుల్లో వైసీపీ షటిల్ టీమ్ లాగా.. ఇద్దరే సభ్యులు నిలుస్తారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఎమ్మిగనూరులో మంగళవారం కర్నూలు-బళ్లారి హైవే మరమ్మతులకు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత వైసీపీకి క్రికెట్ టీమ్ ఉందని, భవిష్యత్తులో షటిల్ టీమ్‌గా మిగులుతుందని అన్నారు. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు.
News November 5, 2024
న్యాక్ సెంటర్‌లో జాబ్ మేళా.. 26 మందికి ఉద్యోగాలు
కర్నూలు బిర్లా గేట్ వద్దనున్న న్యాక్ సెంటర్‌లో ఇవాళ జాబ్ మేళా నిర్వహించారు. 95 మంది ఇంటర్వ్యూలో పాల్గొనగా.. శ్రీరామ్ చిట్స్&ఇన్సూరెన్స్‌లో 12 మంది, టాటా క్యాపిటల్‌లో 8 మంది, ఎస్‌వీసీసీలో ఆరుగురు, మొత్తం 26 మంది ఉద్యోగాలు పొందారని నైపుణ్య అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఎంపికైన వారికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో కో-ఆర్డినేటర్ ప్రశాంత్, న్యాక్ ఏడీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
News November 5, 2024
పవన్ కళ్యాణ్ కప్పట్రాళ్లకు రావాలి: సీపీఐ నేత రామకృష్ణ
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కప్పట్రాళ్ల ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు. యురేనియం కోసం 68 బోర్లు వేయడానికి అధికారులు సిద్ధమయ్యారని అన్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఆందోళనలను అడ్డుకోవాలని చూడటం తగదని హెచ్చరించారు. గతంలో ఆళ్లగడ్డ, పులివెందులలో యురేనియం తవ్వకాలను టీడీపీ వ్యతిరేకించిందని చెప్పారు.