News February 23, 2025

నంద్యాల జిల్లాలో కిలో చికెన్ ఎంతంటే?

image

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఇవాళ కిలో చికెన్ రూ.140-160 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-750లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.

Similar News

News December 10, 2025

కేతకీ పుష్పాన్ని పూజలో ఎందుకు వినియోగించరు?

image

శివ పూజలో కేతకీ పుష్పం వాడరన్న విషయం తెలిసిందే! శివుని జ్యోతిస్తంభం ఆది, అంతాలను కనుగొన్నానని బ్రహ్మ అబద్ధం చెప్పడానికి ఈ పుష్పాన్నే సాక్ష్యంగా చూపాడట. అది అబద్ధపు సాక్ష్యమని గ్రహించిన శివుడు తన పూజలో ఈ పుష్పాన్ని వాడొద్దని శపించాడు. అందుకే శివపూజలో మొగలి పువ్వును వాడరు. అయినప్పటికీ శివ భక్తులు దీనిని తలలో ధరించవచ్చని, పూజా ప్రాంగణంలో అలంకారం కోసం ఉపయోగించవచ్చని పురోహితులు సూచిస్తున్నారు.

News December 10, 2025

తిరుపతి: కళ్లు లేకున్నా.. 200KM స్కేటింగ్

image

తిరుపతి జిల్లాకు చెందిన అంధ స్కేటర్ మురారి హర్షవర్ధన్‌ నాన్‌స్టాప్‌గా 200 KM బ్లైండ్ స్కేటింగ్ మారథాన్ చేశాడు. ఆర్టిస్టిక్, మల్టీటాస్క్ విభాగాల్లో ప్రపంచ రికార్డులు సాధించాడు. సంబంధిత సర్టిఫికెట్లను తిరుపతిలో మంగళవారం సాయంత్రం బాలుడికి అందజేశారు. వండర్ బుక్, జీనియస్ బుక్, వజ్ర రికార్డ్స్ ప్రతినిధులు పురస్కారాలు ఇచ్చారు. హర్షవర్ధన్ అందరికీ ఆదర్శమని పలువురు పేర్కొన్నారు.

News December 10, 2025

శరీరంలో ఈ మార్పులు వస్తే జాగ్రత్త!

image

చాలా మంది కిడ్నీ సమస్యలను త్వరగా గుర్తించకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో వచ్చే కొన్ని మార్పులను గమనించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తక్కువ లేదా రాత్రి వేళల్లో అతి మూత్రం, మూత్రంలో నురుగు/ఎర్రటి రంగు, ముఖం/పాదాలు లేదా శరీరం ఉబ్బినట్లు అనిపిస్తే జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. బీపీ పెరుగుతున్నా కిడ్నీ సమస్యలుగా గుర్తించాలని చెబుతున్నారు.