News February 23, 2025
నంద్యాల జిల్లాలో కిలో చికెన్ ఎంతంటే?

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఇవాళ కిలో చికెన్ రూ.140-160 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-750లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News
News March 19, 2025
రాత్రికి రాత్రే YSR పేరు తొలగించారు: వైసీపీ

AP: విశాఖపట్నంలో కూటమి నాయకుల ఉన్మాదం పతాక స్థాయికి చేరిందని వైసీపీ ఆరోపించింది. ‘వైజాగ్ క్రికెట్ స్టేడియానికి ఉన్న YSR పేరును టీడీపీ నేతలు తొలగించారు. రాత్రికి రాత్రే డా.వైఎస్సార్ ACA VDCA క్రికెట్ స్టేడియంగా ఉన్న పేరును ACA VDCA క్రికెట్ స్టేడియంగా మార్చారు. గతంలో వైజాగ్ ఫిలింనగర్ క్లబ్‌లోని లాన్‌కు ఉన్న వైఎస్సార్ పేరును కూడా తొలగించారు’ అని Xలో ఫొటోలు పోస్ట్ చేసింది.
News March 19, 2025
వికారాబాద్ జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు డీఈఓ రేణుకాదేవి తెలిపారు. ఏలాంటి ఇబ్బందులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08416 235245కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని చెప్పారు.
News March 19, 2025
పాకిస్థాన్‌లో చైనా ఆర్మీ..!

పాకిస్థాన్‌లో ఆర్మీ, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరించేలా చైనా ఒప్పందం చేసుకుంది. సీపెక్ ప్రాజెక్టులోని చైనా కార్మికులని, ఇంజినీర్లను కాపాడేందుకు వీలుగా ఈ డీల్ జరిగింది. ఈ ఒప్పందంతో డ్రాగన్ దేశానికి చెందిన పలు భద్రతా ఏజెన్సీలు పాక్‌లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షిస్తాయి. పాక్‌లో బలూచిస్థాన్ వేర్పాటు వాదుల దాడుల నేపథ్యంలో డ్రాగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.