News April 7, 2025
నంద్యాల జిల్లాలో టుడే TOP NEWS

☞ దొర్నిపాడు ఎస్ఐగా సత్యనారాయణ బాధ్యతలు ☞ రాష్ట్రంలో రూ.3 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి: మంత్రి బీసీ☞ PGRSకు 220 దరఖాస్తులు: కలెక్టర్☞ వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్☞ బండి ఆత్మకూరు ఎస్ఐ, వ్యవసాయ అధికారి ఎస్ఐ, తీవ్ర వాగ్వాదం ☞ ఆళ్లగడ్డ సీఐగా యుగంధర్ బాధ్యతలు ☞ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది రవ్వలకొండలోనే..! ☞ ఆదోని: పెద్ద హరివాణంలో INSTAGRAMలో ప్రేమ.. పెళ్లి
Similar News
News November 2, 2025
విశాఖ: ఉద్యోగాల పేరిట మోసం

గాజువాకలో ఓ మహిళ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేసింది. సత్యవతి తను న్యాయవాదినని జిల్లా కోర్టులో ఉద్యోగాలు ఇప్పిస్తానని శ్రీను, కొండబాబును నుంచి రూ.4,04,500 వసూలు చేసింది. ఉద్యోగాలు రాకపోవడంతో వారు అడగ్గా.. నేను లాయర్ను నాపై ఎలాంటి చర్యలు తీసుకోలేరంటూ ఎదురుతిరిగిందని బాధితులు గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవతిని ఆమె సహాయకులు అప్పలరమణ, సదాశిరావును శనివారం అరెస్ట్ చేశారు.
News November 2, 2025
కల్తీ కుంకుమని ఇలా గుర్తించండి

కొనే ముందే కుంకుమలోని కల్తీని కనిపెట్టడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం కొన్ని చిట్కాలు..* నేచురల్ కలర్ కాకుండా గులాబీ, కాషాయం, మరీ ముదురుగా ఉంటే కృత్రిమ రంగులు వాడారని అర్థం. * సహజంగా చేసిన కుంకుమ రంగు చేతికి అంటుకోదు.. అదే అంటుకుందని గుర్తిస్తే కల్తీ చేశారని అర్థం. * గ్లాసీ లుక్ ఉండే కుంకుమల్లో హానికారక డైలు కలిపినట్లే. * నకిలీ కుంకుమైతే నీళ్లలో కలిపితే కరిగిపోకుండా నీటి రంగు మారుతుంది.
News November 2, 2025
నూజివీడులో నేటి మాంసం ధరలు ఇలా

నూజివీడులో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ రూ.800, చికెన్ రూ.200 నుంచి 220 రూపాయలు, చేపలు కిలో రూ.180 రూపాయల నుంచి 350 రూపాయల వరకు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలు, ఏలూరు నగరంలో మటన్ కిలో రూ.900, చేపలు కిలో రూ.200 నుంచి 380 రూపాయలు, రొయ్యలు కిలో రూ.350 రూపాయలుగా విక్రయిస్తున్నారు.


