News March 22, 2025
నంద్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

☞ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం☞ ఫరూక్ కుటుంబీకులకు సీఎం CBN పరామర్శ☞ పూడిచెర్లలో ఫారం పాండ్ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ☞ అజ్ఞాతంలో జనని బ్యాంక్ సీఈఓ.. ఆందోళనలో డిపాజిటర్లు☞ లింగాపురంలో వ్యక్తి దారుణ హత్య☞ నీటి కుంటల తవ్వకాలను పరిశీలించిన కలెక్టర్☞ 26న మంత్రి బీసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు☞ రంగాపురంలో టిప్పర్ ఢీ కొని వ్యక్తి మృతి☞ మయాలూరులో వర్షానికి కూలిన భారీ వృక్షం
Similar News
News April 20, 2025
‘గ్లోబల్ మీడియా డైలాగ్’కు మోదీ సారథ్యం

ముంబైలో మే 1-4 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES)లో ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ అంశానికి PM మోదీ సారథ్యం వహించనున్నారు. వివిధ దేశాల్లోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్(M&E) రంగాల క్రియేటర్స్‌ను కనెక్ట్ చేసే వేదికే WAVES. సమ్మిట్‌లో పలు అంశాలపై సెషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ నినాదంతో M&E హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
News April 20, 2025
NZB: రేపు ప్రజావాణి రద్దు

ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి రద్దయ్యింది. సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి తిరిగి యథావిధిగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.
News April 20, 2025
BRS ఓటమి తెలంగాణకే నష్టం: కేటీఆర్

TG: ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ కంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంది. కానీ 500 రోజులైనా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.