News March 18, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ నేర నియంత్రణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్: ఎస్పీ
☞ శ్రీశైలంలో 27 నుంచి ఉగాది ఉత్సవాలు: ఈవో
☞ మహానందిలో విషాదం.. ఒకరి మృతి
☞ పచ్చర్లపల్లిలో కాలువలో నీళ్లు తాగేందుకు వెళ్లి మహిళ గల్లంతు
☞ అత్యాచారం కేసులో పేరుసోముల వ్యక్తికి జీవిత ఖైదు
☞ ప్రభుత్వ స్థలాలను గుర్తించండి: కలెక్టర్
☞ పవన్ కళ్యాణ్పై శిల్పా ఫైర్
Similar News
News November 18, 2025
ములుగు: పోలీసుల అదుపులో దేవ్ జీ..?

ఏపీ పోలీసుల అదుపులో మావోయిస్టు కీలక నేత ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి@దేవ్ జీ ఉన్నట్లు తెలుస్తోంది. మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నంబాల కేశవరావుకు సంబంధించిన సెక్యూరిటీతో పాటు మరి కొంత మంది కీలక నేతలను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు వినవస్తుంది. రేపు వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
News November 18, 2025
పెనాల్టీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: మేయర్

అసెస్మెంట్లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల 25 రెట్లు పెనాల్టీ నమోదైన నగర వాసులు, ఈ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. మంగళవారం బల్దియా కౌన్సిల్ హాల్లో రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై జరిగిన సమావేశంలో ఆమె అధికారులకు సూచనలు చేశారు.
News November 18, 2025
గద్వాల్: హంద్రీ ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి వ్యక్తి మృతి

కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్లే హంద్రీ EXPRESS నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందినట్లు మహబూబ్నగర్ రైల్వే ఎస్సై కే.రాజు తెలిపారు. దివిటిపల్లి బ్రిడ్జి రైల్వే లైన్ సమీపంలో డెడ్బాడీ లభించింది. మృతుడికి (25) ఉండవచ్చునని, రన్నింగ్ ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడి చనిపోయినట్లు గుర్తించారు. ఎవరైనా ఈ మృతదేహాన్ని గుర్తిస్తే సెల్ నంబర్ 8712658597 సమాచారం ఇవ్వాలన్నారు.


