News March 23, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ నంద్యాలలో వార్డెన్ పై పోక్సో కేసు నమోదు
☞ శ్రీశైలంలో ఉగాది ప్రత్యేకతపై Way2 News ఫోకస్
☞ ఎర్ర బంగారంపై వర్ష ప్రభావం
☞ శ్రీశైలంలోని కృష్ణా నదిలో మునిగి యువకుడి మృతి
☞ నల్లమల్ల అడవుల్లో కన్నడ భక్తుల సందడి
☞ కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు: పవన్ కళ్యాణ్
☞ ఆళ్లగడ్డలో కిలో చికెన్ ధర రూ.90
☞ స్థల వివాదంతోనే సుధాకర్ రెడ్డి హత్య: బండి ఆత్మకూరు ఎస్ఐ
☞ PGRS వేళలో మార్పులు: కలెక్టర్
Similar News
News November 28, 2025
ఖమ్మం: 15 మంది నోడల్ అధికారుల నియామకం

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను 13 విభాగాలుగా విభజించి 15 మంది నోడల్ అధికారులను నియమించారు. వీరందరికీ గతంలో ఎన్నికల విధులు నిర్వర్తించిన అనుభవం ఉంది. ఎన్నికల కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు గాను వీరిని నియమిస్తూ ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు 15 మంది ఒక్కో రకమైన బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
News November 28, 2025
అమీన్ పీర్ దర్గాలో ‘రాజు వెడ్స్ రాంబాయ్’ టీమ్ సందడి

కడప పెద్ద దర్గాను ‘రాజు వెడ్స్ రాంబాయ్’ చిత్ర బృందం శుక్రవారం దర్శించుకుంది. హీరో అఖిల్ రాజ్, హీరోయిన్ తేజేశ్వి, నిర్మాత రాహుల్, డైరెక్టర్ సాయిల్, విక్రమ్, చైతన్య తదితరులు చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. సినిమా హిట్ కావడం సంతోషంగా ఉందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు తీస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
News November 28, 2025
విమాన వేంకటేశ్వరస్వామి విశిష్టత

తిరుమల గర్భాలయంపై ఉన్న గోపురాన్ని ఆనంద నిలయ విమానం అంటారు. ఈ గోపురంపై కొలువై ఉన్న స్వామివారి రూపమే ‘విమాన వేంకటేశ్వర స్వామి’. విమానం అంటే కొలవడానికి వీలుకాని అపారమైన శక్తి కలిగినది అని అర్థం. ఇది భక్తులకు నేరుగా వైకుంఠవాసుడిని చూసిన అనుభూతినిస్తుంది. ఈ గోపురంలో మొత్తం 60 మంది దేవతా మూర్తులు ఉంటారు. ఈ స్వామిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. <<-se>>#VINAROBHAGYAMU<<>>


