News March 25, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా E-KYC చేయించుకోవాలి: జేసీ
☞ చంద్రబాబు ఎంతమందికి జరిమానాలు విధించాడు?: కాటసాని
☞ కోడుమూరు ఘటన.. విద్యార్థిపై కేసు నమోదు
☞ శ్రీశైలంలో ఎటు చూసినా భక్తుల వాహనాలే
☞ కర్ర సాములో అదరగొడుతున్న ఉయ్యాలవాడ మోడల్ స్కూల్ విద్యార్థి
☞ రంగాపురానికి చెందిన IIT విద్యార్థి ఆత్మహత్య
☞ ఆళ్లగడ్డ MLA భర్త కిలో చికెన్ కు రూ.10 వసూలు: YCP
☞ బెట్టింగ్ లపై ఎస్పీ హెచ్చరిక
Similar News
News April 2, 2025
ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి

AP: విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. దీపిక అనే యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి(43) మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుడిని నవీన్గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
News April 2, 2025
శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని ఎస్పీకి ఆహ్వానం

నడిగూడెం మండలం వేణుగోపాలపురంలో ఈ నెల 6న జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరు కావాలని జిల్లా ఎస్పీ నర్సింహాను ఆలయ ధర్మకర్త కొల్లు క్షత్రయ, నడిగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులుఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆలయ ధర్మ కర్త మాట్లాడుతూ.. శ్రీరామ నవమి ఆహ్వానంపై ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.
News April 2, 2025
నేటి జగిత్యాల మార్కెట్ ధరలు…

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు గరిష్ఠ రూ. 2231, కనిష్ఠ రూ. 1860; పసుపు (కాడి) గరిష్ఠ రూ. 13001, కనిష్ఠ రూ. 6000; పసుపు (గోళ) గరిష్ఠ రూ. 11500, కనిష్ఠ రూ. 5500; కందులు గరిష్ఠ రూ. 6420, కనిష్ఠ రూ. 5789లుగా పలికాయి. ఈ రోజు మొత్తం 1341 క్వింటాళ్ల కొనుగోళ్ళు జరిగాయని మార్కెట్ కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు.