News March 29, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

☞ శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం.. IPS అధికారి, డాక్టర్ దుర్మరణం
☞ రుద్రవరంలో మరోసారి భానుడి విశ్వరూపం.!
☞ కర్నూలులో ఎలక్ట్రిక్ కారు బీభత్సం
☞ ఆర్.జంబులదిన్నెలో అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
☞ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించండి: కలెక్టర్
☞ శ్రీశైలంలో వైభవంగా మూడో రోజు ఉగాది బ్రహ్మోత్సవాలు
☞ రహదారుల నిర్మాణానికి రూ.600 కోట్లు: మంత్రి బీసీ
☞ ఆత్మకూరులో ఇద్దరు దొంగల అరెస్ట్

Similar News

News November 13, 2025

NZB: ప్రభుత్వ సలహాదారు మాత్రమే కాదు.. జిల్లాకు మంత్రి: టీపీసీసీ చీఫ్

image

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మాత్రమే కాదని జిల్లాకు వాస్తవిక మంత్రి అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ గ్రౌండ్స్‌లో సుదర్శన్ రెడ్డికి నిర్వహించిన అభినందన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనుభవం, ఆలోచన, అభివృద్ధిలో సుదర్శన్ రెడ్డి పెద్దన్న లాంటి వారన్నారు.

News November 13, 2025

పదో తరగతి పరీక్ష ఫీ డేట్ ఈనెల 20 వరకు గడువు: డీఈవో

image

పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లింపు ఈనెల 20 వరకు గడువు పొడిగించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఇంకా ఫీజు చెల్లించని వారు 20వ తేదీ సాయంత్రంలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News November 13, 2025

అనకాపల్లి: ‘సచివాలయాల వద్ద అంగన్వాడీలు ధర్నా’

image

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడి కార్యకర్తలు ఈనెల 14వ తేదీన జిల్లాలో గల సచివాలయాల వద్ద ధర్నా నిర్వహించనున్నట్లు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఎం.దుర్గారాణి తెలిపారు. గురువారం అనకాపల్లిలో నిర్వహించిన యూనియన్ జిల్లా కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగ శేషు మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలన్నారు.