News March 31, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు

image

* కర్ణాటక భక్తులతో పోటెత్తిన మహానంది క్షేత్రం* రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్* ఈద్గాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు* బేతంచర్ల ఈద్గాలో నల్ల బ్యాడ్జిలతో నిరసన * బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తపై దాడి* ఈకేవైసీ గడువును సద్వినియోగం చేసుకోండి: కొలిమిగుండ్ల MRO * వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన

Similar News

News December 7, 2025

‘నిజామాబాద్‌ జిల్లాలో మితిమీరుతున్న వీడీసీల ఆగడాలు’

image

నిజామాబాద్ జిల్లాలో వీడీసీల ఆగడాలు మితిమీరుతున్నాయని పలువురు మండిపడుతున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీలు వేలం పాట వేసి బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తున్నారని పలువురు ఆరోపరిస్తున్నారు. మోర్తాడ్ మండలం <<18479746>>డోన్కల్‌లో రూ.32 లక్షలకు వేలం<<>> వేసినట్లు ఎస్సీ అభ్యర్థి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. బాల్కొండ,ఆర్మూర్ నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో ఇలా జరుగుతున్నా వాటిని బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

News December 7, 2025

విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన లెక్చరర్

image

శ్రీకాళహస్తిలోని రిపబ్లిక్ క్లబ్ వద్ద గల ఓ ప్రైవేట్ కళాశాల తెలుగు లెక్చరర్ విద్యార్థినిని వాతలు పడేటట్లు కొట్టాడు. స్థానిక గోపాలవనం వద్ద నివాసం ఉంటున్న అనీస్ అనే విద్యార్థి శనివారం కళాశాలకు వెళ్లాడు. అక్కడ తెలుగు లెక్చరర్ విద్యార్థి పేరాగ్రాఫర్ రాయలేదని బెత్తంతో వాతలు పడేటట్లు కొట్టాడు. కళాశాల యజమాన్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా వ్యవహరించడం సరికాదన్నారు.

News December 7, 2025

ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది: డీఈవో

image

పదో తరగతి ఫలితాల కోసం ప్రతీ టీచర్ యుద్ధం చేయాల్సిన సమయం వచ్చిందని డీఈవో శామ్యూల్ పాల్ అన్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఉన్నత పాఠశాలలో స్టడీ అవర్స్ తరగతులను శనివారం ఆయన పరిశీలించారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా పాఠ్యాంశాలపై అవగాహన కల్పించి, పాఠాలు పూర్తిగా నేర్పే బాధ్యత ఉపాధ్యాయులదేనని ఆయన తెలిపారు. ప్రతీ పాఠశాలలో షెడ్యూల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు.