News March 2, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలి: కలెక్టర్
☞ రాష్ట్ర పునర్నిర్మాణానికి బడ్జెట్ పునాది లాంటిది: మంత్రి ఫరూక్
☞ చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలి: సీఐ చిరంజీవి
☞ అధికారుల బాధ్యతారాహిత్యంతోనే మరణాలు: కాటసాని
☞ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి: మైలేరి మల్లయ్య
☞ జిల్లాలో ఈనెల 7 నుంచి ఇంటర్ వాల్యుయేషన్
☞ శ్రీశైలం మల్లన్న టికెట్ల గోల్ మాల్
☞ మహిళ ఆత్మహత్య
Similar News
News March 18, 2025
విశాఖ: టీడీపీలోకి వైసీపీ కార్పొరేటర్లు?

విశాఖలో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి కనిపిస్తోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు అమరావతి చేరుకున్నట్లు సమాచారం. కార్పొరేషన్‌లో బలం పెరిగాక మేయర్‌పై అవిశ్వాసం పెట్టే యోచనలో కూటమి ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల చేరికపై మరికొద్ది గంటల్లో స్పష్టత రానుంది.
News March 18, 2025
వైసీపీకి షాక్: వైజాగ్ మేయర్‌పై అవిశ్వాసం?

AP: విశాఖ నగరపాలకసంస్థలోని వైసీపీకి చెందిన 9 మంది కార్పొరేటర్లు కాసేపట్లో టీడీపీ, జనసేన పార్టీల్లో చేరనున్నారు. ఇందుకోసం వారు అమరావతి చేరుకున్నారు. వీరితో కలుపుకొని జీవీఎంసీలో కూటమి సభ్యుల బలం 75కు చేరనుంది. అనంతరం జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కూటమి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం GVMCలో 97 మంది కార్పొరేటర్లు ఉన్నారు.
News March 18, 2025
తిరుగు ప్రయాణం మొదలు

అంతరిక్ష కేంద్రం నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌ల తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం గం.10.36ని.లకు ISS నుంచి స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ సపరేట్ అయింది. దీంతో భూమ్మీదకు వారి ప్రయాణం ప్రారంభమైంది. రేపు భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున గం.3:27కు ఫ్లోరిడా తీర జలాల్లో ల్యాండ్ కానుంది.