News April 4, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞నంద్యాల GGHలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ☞ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించిన మంత్రి BC☞కందనాతిలో పిడుగుపాటుతో బాలుడి మృతి☞బనగానపల్లె ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLAలు☞నందవరం చౌడమ్మ హుండీ ఆదాయం రూ.4.21లక్షలు☞మంత్రి లోకేశ్‌ను కలిసిన ఆళ్లగడ్డ MLA☞కేంద్ర మంత్రికి ఎంపీ శబరి వినతి☞8 మంది ఎస్ఐలకు పోస్టింగులు
Similar News
News April 18, 2025
సంగారెడ్డి జైలులో ఖైదీ మృతి

సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీ వెంకట్(39) గుండెపోటుతో మృతి చెందారు. మెదక్ నర్సాపూర్‌కు చెందిన వెంకట్‌ను ఓ కేసులో ఈనెల 3న సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఇవాళ అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో వెంకట్ మరణించినట్లు జైలు అధికారులు ప్రకటించారు. మృతదేహాన్ని సంగారెడ్డిలోని మార్చురీకి తరలించారు.
News April 18, 2025
మంగళగిరిలో ప్రజాదర్బార్ నిర్వహించిన హోం మంత్రి

హోంమంత్రి వంగలపూడి అనిత మంగళగిరి టీడీపీ ఆఫీసులో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ప్రజలు తమ సమస్యలను చెప్పుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలు తెలుపుకున్నారు. భూసమస్యలు, పిల్లల విద్యకు సంబంధించి, చెరువుకు సంబంధించిన సమస్యలను అర్జీదారులు హోంమంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సమస్యలన్నిటినీ వెంటనే పరిష్కరించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.
News April 18, 2025
పెంబికి నేషనల్ 4Th Rank.. రూ.కోటి అవార్డ్

ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్స్‌లో పెంబి ఉత్తమ స్థానంలో నిలవడానికి కారణాలు ఇవేనని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, పోషకాహారం, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, ప్రాథమిక మౌలిక సదుపాయాలతో పాటు 40 రంగాల పనితీరు ఆధారంగా జాతీయస్థాయిలో 4 ర్యాంక్, మూడవ జోన్లో 2వ ర్యాంకు వచ్చిందన్నారు. అలాగే రూ.కోటి అవార్డును గెలుచుకోవడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.