News April 9, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

☞చాగలమర్రిలో రికార్డు స్థాయిలో 38⁰C ఉష్ణోగ్రత
☞రేవనూరు హుస్సేన్ వలి స్వామి దర్గా వద్ద భారీ పోలీస్ భద్రత
☞పాణ్యం రహదారిపై బొలెరో బోల్తా
☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA కోట్ల
☞క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ: నందికొట్కూరు MLA
☞ఫరూక్ ను పరామర్శించిన మంత్రి నిమ్మల
☞కోర్టు ఆదేశాలతో అంగన్వాడి హెల్పర్ రమాదేవి కొనసాగింపు: CDPO
☞డోన్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.

Similar News

News February 25, 2026

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన వనపర్తి కలెక్టర్

image

జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణ తీరును కలెక్టర్ ఆదర్శ్ సురభి బుధవారం స్వయంగా పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష గదుల్లో వెలుతురు, విద్యార్థులకు తాగునీటి సౌకర్యం, సీసీ కెమెరాల నిఘాను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్‌కు తావులేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

News February 25, 2026

NZvsSL: ఇవాళ ఓడితే శ్రీలంక ఇంటికే

image

T20WC సూపర్-8లో భాగంగా గ్రూప్-2లో న్యూజిలాండ్-శ్రీలంక మధ్య నేడు కీలక మ్యాచ్ జరగనుంది. కొలంబో వేదికగా 7PMకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇప్పటికే ఓ మ్యాచ్ ఓడిన శ్రీలంక ఇవాళ కూడా పరాజయం పాలైతే ఇంటిబాట పట్టనుంది. కివీస్ గెలిస్తే సెమీస్ రేసులో నిలుస్తుంది. నిన్న పాక్‌పై గెలుపుతో ఇంగ్లండ్ సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ నెల 27న ENGvsNZ, 28న SLvsPAK మ్యాచ్‌ల ఫలితాలను బట్టి రెండో స్థానంపై క్లారిటీ రానుంది.

News February 25, 2026

సిద్దిపేట: అవ్వా.. వ్యాపారం ఎట్లుంది: హరీశ్ రావు

image

సిద్దిపేట పట్టణంలోని మోడల్ రైతు బజార్‌ను హరీశ్ రావు రాత్రి సందర్శించారు. రైతులతో ఆత్మీయంగా మాట్లాడుతూ అవ్వా.. వ్యాపారం ఎట్లుంది అని మహిళా రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతు బజార్లో అందుతున్న సేవలను అడిగి తెలుసుకుని రైతులకు ఇబ్బందులు కలకుండా చూడాలని, అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు.